అన్నదాతకు
జేజేలు
1.    
అతను కష్టాన్ని నమ్ముకుంటాడు 
పైరవీలను
కాదు.
2.    
అతను ఏడాది పొడుగునా ఎండనక, వాననక
శ్రమపడతాడు
మనకు
మల్లే ఏసీలకోసం వెదుకడు.
3.    
సకాల వర్షాలతో పంటలు పండితే పొంగిపోతాడు
అకాల
వర్షాలకు వలస పోడు.
4.    
నేలను నమ్ముకుంటాడు
నేలను
అమ్ముకోడు.
5.    
మట్టిని నమ్ముకున్న వాడు
ఆ
మట్టిలోనే కలిసే వాడు
6.    
అతడే మన అన్నదాత
అతను కాక
మరెవరు?
*****

No comments:
Post a Comment