Home

Thursday, May 23, 2019

చిత్రకవిత- మరక మంచిదే!


మరక మంచిదే!
ఏడాదికి తొమ్మిది నెలలు
సోమరితనం లేకుండా
పని చేసుకుంటూ ఉన్నప్పుడు,

చిన్ని నా బోజ్జే కాకుండా
దేశంలో మరి కొందరి
కడుపులు కూడా నింపినప్పుడు,
దేశానికి వెన్నెముకైన
అన్నదాతలలో నేనున్నప్పుడు
నా ఒంటికంటిన
మట్టి గురించి నాకెందుకు దిగులు?
మరక మంచిదేగా!

No comments:

Post a Comment