(continued from the previous post)
ఇలా
ఓ వారం రోజులు గడిచాయి. రాఘవ రావుగారిని ఐసీయూ నుండి వార్డుకి మార్చేశారు. సాయంత్రం
నాలుగు నుండి ఎనిమిది వరకు ఎవరైనా సరే రోగిని పరామర్శించవచ్చు. మొదటి రోజున ఊళ్ళో లేకపోవడం
వల్ల చూడలేకపోయాడు, విశ్వనాథం. ఊళ్ళోకి వస్తూనే తెలిసిన విషయమేమంటే, కాకులైన లోకులు
పలకరించే నెపంతో రావు గారిని చూసి, వివరాలు కూపీ లాగడానికి ప్రయత్నించారట. ఆయన ఆవేదనా
భరితమైన ఆవేశంతో అరిచారట. వీళ్ళు బయటికి వచ్చి ఆయనకు పిచ్చి అనే మరో దుష్ప్రచారం మొదలుపెట్టారు.
విశ్వం ఎంతగానో బాధపడి, నాలుగు ఎప్పుడౌతుందా
అని చూసి చూసి, ఎట్టకేలకి ఆసుపత్రి చేరుకున్నాడు.