Wednesday, May 22, 2019

చిత్రకవిత-ఆమ్లాసురుడు చూసి కుళ్ళుతో కళ్ళు మూసుకునేవాడవడూ?


ఆమ్లాసురుడు చూసి కుళ్ళుతో కళ్ళు మూసుకునేవాడవడూ?
నన్ను చూసి కొందరులిక్కి పడతారు
మరి కొందరు మొహం తిప్పుకుంటారు
వారి చేష్టలు ఒక దుర్మార్గుణ్ణి సంతోష పెడతాయి
అదే, వాడే, నా ముఖం మీద ఆమ్లం పోసిన అసురుడు


కానీ వాడికి తెలియనిదొకటుంది
అందరూ వాడిలా బాహ్య సౌందర్యాన్నే ఆరాధించరని
నన్ను ప్రేమించిన నా వాడు, ‘నాకు నువ్వు ముఖ్యం, నీ రూపు కాద’న్నాడు
తన మాట నిలుపుకున్నాడు.

తన ఆదర్శాలు పంచుకు పుట్టిన నా ముద్దుల కొడుకు
నాకు ప్రేమగా ముద్దు  పెడుతుంటే, ఆ
ఆమ్లాసురుడు చూసి కుళ్ళుతో కళ్ళు మూసుకునేవాడవడూ?
****

1 comment:

Anonymous said...

Betting Tips180 Football Prediction, Predictions and Analysis 10bet 10bet 10cric login 10cric login 540nfl week 1 lines 2020 - casinoland.jp