Home

Thursday, January 25, 2018

చిత్రకవిత- రెండు తలల పాము


రెండు తలల పాము
ఒక తల దొంగలని పడుతుంది
మరొక తల పోరాని ప్రదేశాలకు పోతుంది
ఒక తల నేరాలను ఆపుతుంది
మరొక తల బ్లాక్మెయిల్ కి తోడ్పడుతుంది

ఒక తల దుండగుల పని పడుతుంది
మరొక తల భయ పెడుతుంది
ఇదొక భద్రతాపరికరమా?
లేక మనుషుల్ని భయపెట్టే పరికరమా?
విచక్షణతో వాడితే మంచిది
లేకపోతే అనర్ధాలు కొల్లలు
ఈ రెండు తలల పాము
ఈ రహస్య గూఢచారి అంటే తస్మాత్ జాగ్రత్త!

**************

No comments:

Post a Comment