Home

▼

Wednesday, January 31, 2018

చిత్రకవిత- ఓ జాతిపితా, మా అజ్ఞానాన్ని మన్నించు




ఓ జాతిపితా, మా అజ్ఞానాన్ని మన్నించు
ఆస్తి ఉండి కూడా ఉంచుకోలేదు
పేరుప్రఖ్యాతులకాశ పడలేదు
వలస వాదాన్ని ఎదిరించావు
మాకు స్వాతంత్ర్యాన్నిచ్చావు


మంచితనంతో మూర్ఖుల మనసు గెలిచావు
ఉపవాసదీక్షతో ఉన్మాదుల మనసు మార్చావు
సత్యాగ్రహమనే ఆయుధాన్ని ప్రపంచానికిచ్చావు
సమస్యలకు శాంతియుత పరిష్కారాలని సూచించావు

మేము నిన్ను అపార్ధం చేసుకున్నామేమో!
నీ ఆశయాలు ఇంకా అసంపూర్ణంగానే నెరవేరాయి.

ఓ జాతిపితా, మా అజ్ఞానాన్ని మన్నించు
మా దేశంలో మరల జన్మించు
మరల సన్మార్గాన్ని బోధించు
మాలో మంచితనాన్ని పెంచు!

*************

No comments:

Post a Comment