నా
మాతృభాషైన
తెలుగులో
ఒకప్పుడు
బాగానే
వ్రాసేదాన్ని.
అంటే
రెండవ
భాషలో
మంచి
మార్కులు
వచ్చేంత.
ఎటొచ్చీ
నవలలూ
గట్రా
చదివేదాన్ని
కాదు.
ఏ
నవలలో
అశ్లీలత
వుందో,
ఏ
నవలలో హింసకి పెద్దపీట వేశారో, దేనిలో స్త్రీలను చిన్నచూపు చూశారో ముందుగానే తెలుసుకోడానికి
ఆ
రోజుల్లో
గూగుళ్ళు
వుండేవి
కావు
కదా!
అలా
అని
ఆకాలపు
సాహిత్యాన్ని
తప్పుబట్టడంలేదు
సుమండీ!
నేను
ఎందుకు
అజ్ఞానిగా
మిగిలిపోయనో
మీకు
చెపుతున్నాను,
అంతే!
అలా
చందమామలో
కథలు
చదివి,
పెరిగి, పెద్దైన
నేను
తెలుగులో
వ్రాయడానికి
భయపడడంలో
ఆశ్చర్యం
లేదు కదా!
ఆ
మధ్య
నేను
ఆంగ్లంలో కథలూ, కాకరకాయలూ వ్రాస్తున్నానని స్నేహితులొకరికి చూపిస్తే, నువ్వు మాతృభాషలో వ్రాయడం మంచిది అని అన్నారు. అన్నా! ఎంత పెద్ద మాట అనేశారు, అని బాధపడ్డాను. మంచి కథ వ్రాసినప్పుడు, తెలుగులోనైతేనేమి, ఆంగ్లంలోనైతేనేమి, బాగానే వ్రాశానుకదా, అనుకున్నాను. ఆంగ్లం వారి మాతృభాష కాకపోయినా ఆర్.కె. నారాయణ్, నిరాద్. సి. చౌదరి వంటి వాళ్ళు ఆంగ్లంలో వ్రాయలేదా? పేరు ప్రఖ్యాతులనొందలేదా? అని కూడా అనుకున్నాను. పైగా, నాపై నాకే నమ్మకం
లేకపోతే
ఎలా?
అంత
చెత్తగా
వ్రాయనేమో! నా విమర్శకులు మేధావి, నా పామరస్థాయి రచనలు బహుశః ఆయనకి రుచించలేదేమో, అని సరిపెట్టుకున్నాను. అయినా, మహా మేధావులు రచించినవేమైనా సగటు మనిషి చదివి, అర్థం చేసుకోగలడా? లేదే! మరి, నాబోటి పామరులమాటేమిటి? మనం మేధావులం కామే, అని ఉసూరుమని నిట్టూర్చడమేనా? నా బుఱ్ఱలేనితనంకానీ, ఎవరైనా సగటు మనుషులకు అర్థమయ్యేటట్టు కథలూ, కారుణ్యాలూ వ్రాశారేమో? నేనెప్పుడైనా చదివి వెలగబెడితే కదా! ఏ సమాజపు కథలు ఆయా భాషల్లో వ్రాయాలని ఆయన వుద్దేశం కాదుకదా? ఐనా సరే, నేను ఆంగ్లంలో వ్రాద్దామని నిర్ణయించేసుకున్నాను.
ఈ లోగా నాకొక ఇబ్బందికరమైన ఆలొచన వచ్చింది. బహుశః నేను చెత్త కథలు వ్రాస్తున్నానా? అని. దానికి తావే లేదు. నాకు మంచి ఆలోచనలు రాకపోతే, కిమ్మనకుండా వుంటానుగానీ చెత్త కథలు వ్రాసి నా పాఠకులని ఇబ్బంది పెట్టను. అలా నా దృష్టిలో నన్ను దిగజార్చుకోను. ఏమైనా తప్పులు దొర్లాయా అని నన్ను నేను ప్రశ్నించుకుని నా వ్రాతలను చూతునుగదా, కొన్ని వ్యాకరణపరమైన తప్పులు కనిపించాయి. ఆలోచనని పొందికగా అందించే సమయంలో అవి చొచ్చుకుపోయి వుంటాయి. వాటిని సరిదిద్దాలి. పోనీ, ఇలాంటి ఆలోచనలు ఆంగ్లభాషా పాఠకులకి నచ్చవని ఆయన వుద్దేశ్యమెమో! కావచ్చు. నేనొక గొప్ప కథారచయిత అవడానికి ప్రయత్నిస్తున్నానా? లేక, నాకొచ్చిన కొన్ని మంచి ఆలోచనలని నాతోను, అలాంటి అలోచనలు ఇష్టమైనవారితోను పంచుకోవాలనుకుంటున్నానా? నేను రెండవ కోవకే చెందుతాను. అలా అనుకొని, నా రాతకోతల్ని గూడెక్కించాను (అంటే, వెబ్ అన్నమాట!). నన్ను నిరాశపఱచకుండా రోజూ చాలా తక్కువమంది నా గూడుపుటని (అంటే వెబ్పేజ్ అని, గూడుపుఠాణి అనుకునేరు!) చదివేవారు. వారిలో చాలామంది నేను సంకెల పంపిన ఆ కొద్దిమందేను! పరిమిత పాఠకులకోసం వ్రాయడం మొదలుపెట్టిన నేను ఎలా నిరాశ చెందగలను?
బ్లాగర్గా కొంతకాలం గడిచాక మా స్నేహితులన్నమాట గుర్తొచ్చింది. అక్షర పరిజ్ఞానం తప్ప భాషా పరిజ్ఞానంలేని నేను తెలుగులో వ్రాయగలనా?
ప్రయత్నించగలను. మావాళ్ళేకదా నా వ్రాతల విమర్శకులు? వాళ్ళలో నాకన్నా పెద్దవాళ్ళు తెలుగు భాషాపారంగతులేకానీ కంప్యూటర్ విషయానికొస్తే జ్ఞానహీనులు. మఱి, నాకన్నా పిన్నవయస్కులు చాలామంది కంప్యూటర్లో దిట్టలు; తెలుగులో బాగా మాట్లాడగలరు కానీ, చదవలేరు, వ్రాయలేరు. ఇకపోతే, నా స్నేహితులు అన్ని భాషలవాళ్ళూను. వాళ్ళలో ఆంధ్రేతరులు దీన్ని చదవలేరు. ఇప్పుడొచ్చింది అసలు సంకటం. నేను వాళ్ళకోసం వ్రాయాలా, లేక నాకోసం వ్రాయాలా, అని. ఎవరికోసమైతేనేమి, ఎలాగైతేనేమి, ఒకసారి వ్రాసేస్తేపోలే? అనుకున్నాను. అంతే! వ్రాసేశాను. మీకు నచ్చిందని తలుస్తాను! నా స్వగతంపై
మీ నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తున్నాను.
7 comments:
mam, all the best for your new venture. I hope, I can learn good literary words in Telugu language from your blogs, now on.
thank u Ram, but i wasexpecting some criticism! :)
కూయమ్మా తెలుగు కోయిల కూయి
నువ్వు తెలుగు లొ కూస్తానంటే
వద్దనే తెలుగు కాకులు ఎవరు చెప్పు!
నువ్వు రాస్తానంటే పోయేదేం లేదు
తెలుగుకు నవ వసంతం రావడం తప్ప!
ధన్యవాదాలు తెలుగు బాబూ! నాపుట నీ విమర్శకి నోచుకోలేదని అనుకునేదాన్ని ఇంతవరకూ. ఇదంతా మాతృభాషామహాత్మ్యం అన్నమాట! ఇంత ప్రోత్సాహం నువ్విచ్చిన తరువాత నేను తెలుగులో వ్రాయకుండా వుండలేను. నా ప్రయత్నం నేను చేసి ఆ యత్నఫలాన్ని ఈ పుటలో పెడతాను. దానిలో తప్పొప్పులు సరిదిద్దే పూచీ నీదే సుమా!
మనకా బెరుకు ఎప్పుడూ వుంటుంది . మనం వ్రాసేది ఎలా తీసుకుంటారో అని . మంచి చెడు అంటూ ఏమీ లేవండీ .. మీరు దేన్ని గురించి వ్రాయాలనుకుంటున్నారు .. ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేదే ముఖ్యం . :)
నన్ను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలండీ. ఇంకా వ్రాయడానికి ప్రయత్నిస్తాను
Post a Comment