Wednesday, September 28, 2016

ఈ లేమి తీరేదెపుడో!


🌨ఈ లేమి తీరేదెపుడో☔

తల్లి మనసులో మథన:
పచ్చని ఆరుబయట లాల పోస్తున్నా నీళ్ళేవీ?
చెంబుతోనా? డేగిశాడేనా?
నాకు మా అమ్మ అలా చేయలేదే?
బానలతో వేణ్ణీళ్ళు కాచి,గుమ్మరించి,
ఈత కూడా కొట్టనిచ్చేది కదా!

ఇప్పుడేం తక్కువ?

ఒంటరి తల్లిగా నా దగ్గర డబ్బు తక్కువ
కట్టడాలు ఎక్కువైన మా ఊళ్ళో నీళ్ళు తక్కువ
తమ్ముణ్ణి చూసి పొంగిపోయే నా కూతురికి ఈ పాడు లోకపు జ్ఞానం తక్కువ

ఈ లేమి తీరేదెపుడో!

No comments: