చదువుల తల్లి మినహాయింపు
1. బ్రహ్మ, బ్రహ్మాణి సంభాషణ:
బ్రహ్మ: ఓ హంసవాహినీ, నేను
సృష్టించిన ఆడబొమ్మ కలిగించె నాకు మనస్తాపమున్
పాపమందాల ఆ కుందనపు బొమ్మ సంచిత కర్మానుసారం నిర్భుజయై జన్మించున్!
ఏకసంతాగ్రాహియౌ ఆమె తన తెలివితేటలనెట్లు వృద్ధి చేయున్?
పురుషాధిక్య సమాజమునన్ గౌరవప్రదంబుగ నెట్లు జీవించున్?
బ్రహ్మాణి: ఓ సృష్టి కర్తా!
ఇచ్చెద నామెకొక వరమున్
ఉపసంహరించెద నాదొక
శాపమున్
తాకనిచ్చెద తన పాదములతో
నన్నున్
ఒసంగెదన్ అసమాన ప్రతిభ
చిత్రలేఖనమునందునన్.
***
2. జన్మించెనా శిశువు
పుత్రహీనులకున్
వరంబుగనెంచి నా దంపతుల్
ఒసంగిరి నామము వాణీ కృప యని
అక్షరాభ్యాసము చేసిరి కాలి
వేళ్ళతోన్
గమనించితిరి ఆమెకు
ప్రకృతిపైనున్న మక్కువన్
కుంచె పట్టించితిరి ఆమె కాలి
వేళ్ళతోన్
పట్టుదలతో అభ్యసించి ఆమె ఉత్తమమైన
చిత్రంబులను గీచెన్
పికాసో, మైఖేలేంజెలో
సరిసమానంబుగా విశ్వవిఖ్యాతి నొందెన్.
***
No comments:
Post a Comment