Wednesday, October 19, 2016

సూర్యుడు- వెన్నెల

సూర్యుడు- వెన్నెల
1.     తాను మారుజన్మనెత్తి నాకు జన్మనిచ్చింది
పాలతో నాకు బలాన్ని పంచింది
ఆటపాటలపై ఆసక్తి పెంచింది
విద్యాబుద్ధులు నేర్పి నా వ్యక్తిత్వం రూపు దిద్దింది

2.     సమాజంలో శ్రేష్ఠుడనయ్యాను నా తల్లి ఆశీర్వాద బలం వల్లనే
సుఖనిద్ర పడుతోంది ఆమె నేర్పిన విలువల వల్లనే
భార్యాబిడ్డల్ని ప్రేమిస్తాను ఆమె పంచిన ప్రేమ వల్లనే
సమాజ సేవ చేస్తాను ఆమె నుండి నేర్చిన సేవాతత్పరత వల్లనే

3.     ఆమె ఇప్పుడు రెండవ బాల్యంలో ఉంది
ఆమెకు మనిషి సాయం ఎంతైనా ఉంది
ఈ సమయంలో ఆమెకి సేవ చేయలేకపోతే నా బ్రతుక్కి సార్థకత ఏముంది?
సూర్యుని కిరణాలు చల్లదనానికి ఉపయోగించుకున్న వెన్నెలకి విలువేముంది?

***

No comments: