ఒక తల్లి ఆవేదన:
చిన్నారి నా చిట్టి నా తాహతుకు
మించిన బహుమతి కోరింది
బోరింగు నుండి నీళ్ళు
తెస్తే నెల రోజుల్లో కొనిస్తానన్నాను
ఆమె సంతోషంగా అంగీకరించింది
ఉత్సాహంగా ఆమె మోయగాలిగిన
బిందెతో నీళ్ళు తెచ్చింది
అందుకోసం ఎక్కువసార్లు
చక్కర్లు కొట్టింది
నేనింకో ఇంట్లో పాచిపని
ఒప్పుకున్నాను
నెల తిరగ్గానే పట్టీలు
కొన్నాను
ఆమె ఉత్సాహం
రెట్టింపయ్యింది
ఆనందంతో బోరింగు దగ్గరికి
పరుగు తీసింది
నేను కొనిచ్చాని అందరికీ నా
గురించి గొప్పలు చెప్పింది
పాపం, ఆ చిన్నదానికేం
తెలుసు, ఆ పట్టీలు పరోక్షంగా దాని స్వార్జితమని!
***
No comments:
Post a Comment