Wednesday, November 30, 2016

భవిష్యత్తుకి బంగారు బాట



1.     నిన్ను ఎక్కువ రోజులు చదివించలేనురా,
అని వాపోయింది నా నిస్సహాయ మాతృమూర్తి.
వచ్చి వేన్నీళ్ళకి చన్నీళ్ళుగా ఉండమంది.
తల్లికి సాయపడడం కన్నా నాకు కావలసిందేమిటి?


2.     అయినా నా మనసులో ఏదో వెలితి
చదువుకోవాలనే నా ఆశ అడియాసౌతోందని.
దుఃఖపు కారు మేఘాలతో మూసుకుపోయిన
నా మెదట్లో మెరుపులాంటి మాట గుర్తొచ్చింది.
3.     మా మాస్టారు గారు శ్రమ విలువ గురించి చెప్పిన పాఠాలు గుర్తు తెచ్చుకుని
అబ్దుల్ కలాం గారిని మననం చేసుకుని,
ఖాళీ సమయంలో చిన్న చిన్న పనులు చేయడం మొదలు పెట్టాను.
అవి మా అమ్మకి కొంత ఆర్ధిక ఆలంబననిచ్చాయి.

4.     నేను శ్రద్ధగా చదువుకుని వ్యాపారవేత్తగా సంఘంలో ఎదిగాను.
శ్రమ విలువ తెలిసిన వాణ్ణి కాబట్టి విలువలని భద్రంగా ఉంచుకున్నాను
అడుక్కుని సంపాదించుకునే సోంబేరులకు ఆసరాగా ఉండను.
కష్టపడి పైకి రావాలనుకునే వాళ్ళకి తీగెకు పందిరిలా ఊతనిస్తాను
వారి బంగారు భవిష్యత్తుకి బాట వేయడంలో ఉడుత సాయం చేస్తాను.

***

No comments: