1. చిన్నతనమంటే గుర్తొచ్చేది
నేను గెలుచుకున్న బంగారు పతకం కాదు
అమ్మానాన్నలకు తెలియకుండా
వానలో నేను తడిసి ముద్దైన మదుర క్షణాలు!
2. చిన్నతనమంటే గుర్తొచ్చేది వర్షంలో
జారి పడి మోచేతికి తగుల్చుకున్న దెబ్బలు కాదు
వాన నీళ్ళలో వదిలిన కాగితపు
పడవలు- సదావీ, కత్తి ఉన్నవీను!
3. చిన్నతనమంటే గుర్తొచ్చేది
వచ్చిన పెనుతుఫాను కాదు
వాన నీటితో ముద్దయ్యి,
ఏనుగు రంగులోకి మారిపోయిన సముద్రమే!
4. చిన్నతనమంటే గుర్తొచ్చేది
పోయిన కరెంటు కాదు
వేడినుంచి ఉపశమనమిచ్చిన
తొలకరి చినుకులే!
5. చిన్నతనమంటే గుర్తొచ్చేది
నేర్చిన పాఠాలు కాదు
బిగ్గరగా పాడిన వాన పాటలే!
6. చిన్నతనమంటే గుర్తొచ్చేది మూసిన
బడి కాదు
రైన్ కోట్ వేసుకుని బస్సులో
కాలేజీకి చేసిన ప్రయాణమే!
7. వసతులు పెరిగిన ఈ రోజుల్లో
వాన గురించి తలచుకునే వారెవరు?
వానొచ్చి పనికి అడ్డం
తగిలిందని విసుక్కునే వారే తప్ప!
8. పోనీ నేను నా చిన్నతనపు
ఆనందపు పనులను చేసి, ఆనందిద్దామంటే,
నన్నో వింత మృగంలా
చూస్తారంతా పెద్ద, వాళ్ళీ పనులు చిన్నతనంలో చేయనట్టు!
***
No comments:
Post a Comment