1. అక్షరాలు
దిద్దితే సంతోషం
ఏదో కొత్త
పని చేస్తున్నామని
సరిగ్గా
వ్రాశామని ఆనందం
2. చదువుకుంటే
గొప్పవాళ్ళవుతారని గురువు వాళ్ళకి చెప్పారు
పిల్లలు
వాళ్ళ భవిష్యత్తుని ఊహించుకుంటున్నారు
శాస్త్రవేత్తని
అవుతాననొకరు, సైనికుణ్ణి అవుతానని మరొకరు ఇలా ఒకొక్కరూ...
3. ఒక బాలిక
మాత్రం ఆలోచిస్తోంది
చదువుకున్న
వారంతా వేరే వృత్తులు ఎంచుకుంటే
ఎవరు భావి
తరం పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తారని!
ఉత్తములైన
భావి భారత పౌరులుగా వారి భవిష్యత్తుకు పునాది ఎవరు వేస్తారని!
4. ఈ
ఉపాధ్యాయురాలు చదువులో లింగ వివక్షని ఎదుర్కొంటుంది
చదువుంటే
చాలదు, సంస్కారం కూడా ఉండాలని చాటి చెబుతుంది
బాలల్లో
విలువలినుమడింపజేస్తుంది
బాల్యాన్ని
ఒక మధుర స్మృతిగా మారుస్తుంది.
***
No comments:
Post a Comment