Tuesday, December 13, 2016

పచ్చదనంతో చేయి కలపవోయ్




1.     భూమి వేడెక్కుతోందని గోలపెడితే చాలదోయ్
ఆ వేడికి ఆవిరి పోసిన నీ ఏసీని గుర్తు తెచ్చుకో!

2.     వాతావరణం కలుషితమైపోయిందని నినాదాలు చేయకోయ్
స్టేటస్ కోసం నలుగురూ నాలుగు కార్ల మీద వెళ్ళే నీ కుటుంబానికి నచ్చచెప్పుకో!
3.     తిండిలో సారం లేదని వాపోకోయ్
రసాయనిక ఎరువులు వాడమని ప్రోత్సహించే వారిని నిలదియ్యి!
4.     త్రాగే నీరు కరువౌతోందని ప్రసంగాలు చేయకోయ్
సరస్సులని ఎత్తైన కట్టడాలుగా మార్చినవారిని కోర్టుకెక్కించు!
5.     నీటిని వ్యాపారంగా మార్చారని ఏడ్వకోయ్
పీల్చే గాలి ఆ త్రోవన వెళ్ళకుండా జాగ్రత్తపడు!
6.     ప్రకృతిని పరిరక్షిస్తూ పచ్చదనంతో చేయి కలపవోయ్

పంచభూతాలని పరిశుభ్ర పరచుకో! సమృద్ధిగా జీవితాన్ని కొనసాగించుకో!

No comments: