Tuesday, December 27, 2016

పెళ్ళంటే?



1.     పెళ్ళంటే ఖరీదైన దుస్తులు, నగలు కాదు
పెళ్ళంటే అవగాహన అనే ఒక పవిత్ర బంధం

2.     పెళ్ళంటే కేవలం రెండు చేతుల కలయిక కాదు
ఆ కలయిక అంటే ‘ఆజన్మాంతం కలసి నడుద్దాం’
3.     పెళ్ళంటే పట్టు చీర, జరీ పంచెల ‘కొంగు ముడి’ కాదు
ఆ కొంగు ముడి ఒక విడదీయరాని బంధం
4.     పెళ్ళంటే ఆర్భాటాలు, ఆడంబరాలు కాదు
పెళ్ళంటే రెండు మనసులు ఒకటవడం
5.     పెళ్ళి చారిత్రాత్మకంగా ఉండాలంటే:
ఎనిమిదొందల కోట్ల పెళ్ళి కూడా విడాకులయ్యిందని గుర్తుంచుకోండి
మీరూ ఆడంబరాలకు పోకండి
మహారాష్ట్రలోని ఒక జంటని చూడండి
వాళ్ళు పెళ్ళి ఖర్చుల డబ్బులు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి ఇచ్చారండి
మీరూ ఆ బాటనే నడవండి
కష్టాల్లో ఉన్న వారికి తోచిన సాయం చేయండి.
***


No comments: