Tuesday, January 3, 2017

వృక్షరాజు దీనావస్థ



1.     ఓ వృక్షరాజమా! కీకారణ్యంలో వేళ్ళూ, కొమ్మలూ పరచుకుని దర్జాగా జీవించే నీకు ఏమి దీనావస్థ కలిగిందో కదా!
మనవ కంకరారణ్యంలో డాబు కోసం చూపే బక్క ప్రాణివయ్యావా?

ఇక్కడి కాలుష్యం అక్కడి పచ్చదనానికి సాటిరాదు
ఇక్కడి పరాధీన జీవితానికీ అక్కడి స్వాతంత్ర్యానికి పోటీ లేదు
అక్కడి సామూహిక జీవనానికి ఇక్కడి ఒంటరి బ్రతుకుకీ పోలికే లేదు.
2.     మనుషులు నిన్ను కొట్టలేదని సంతోషించకు
నీ తల్లిదండ్రులనీ, తోబుట్టువులని ఎంతమందిని నీకు దూరం చేశారో గుర్తుంచుకో
నీ క్షమాగుణాన్ని అడ్డుపెట్టుకుని నీ పళ్ళు, కాయలు, తినేసి
నీ శరీరంలో ఉపయోగపడేవన్నిటినీ వాడేసుకుని
నిన్ను ఏకాకిని చేసిన ఆ స్వార్థపు మనుషులకు బుద్ధి ఎప్పుడొస్తుందో?
3.     సామూహికంగా వానలు తెప్పించే శక్తి ఉన్న మిమ్మల్ని ఏకాకులను చేసి,
మీ బలాన్ని సంగ్రహించి మానవులు తమ పతనాన్ని కోరి మరీ తెచ్చుకుంటున్నారు
ఇరవై ఒకటో శతాబ్దపు యుద్ధాలకి పునాది వేస్తున్నారు.
అయినా, ఓ వృక్షరాజమా! నువ్వు నీ నిస్స్వార్థపు పని చెయ్యి.
మానవుడు నిన్ను చూసి బుద్ధి తెచ్చుకుంటాడేమో చూడు.

***

No comments: