1.
మీ దేశంలో
ఆడవాళ్ళకి గౌరవప్రదమైన స్థానం లేదంటే
ఆడదంటే ఆదిశక్తి అంటావ్
ఆడది కనిపిస్తే మాత్రం వెంటనే రోడ్
రోమియోవి అయిపోతావ్.
2.
నీ
తల్లిని గౌరవంగా చూసుకుంటావ్
నీ భార్యని మాత్రం కష్ట పెడతావ్
నీదెంత ద్వంద్వత్వం రా!
3.
ఒక స్త్రీ
కడుపున పుట్టావ్
కానీ స్త్రీని గౌరవించడం చేతకాదు
నీ భార్య కడుపులో ఆడపిల్లుంటే వెంటనే శిశుహత్యకి
పాల్పడతావ్.
4.
ఒక
ఆడదానికి మొగుడివై
మిగతా ఆడవాళ్ళ వెంట పడతావ్
నీదెంత నీచ పుట్టుకరా!
5.
ఒక పక్క
అమ్మవారికి హారతిస్తావ్
మరోపక్క ఆడవాళ్ళని నీ కామానికి
బలిచేస్తావ్
నువ్వు పురుట్లో చచ్చినా బాగుండేదిరా!
6.
స్త్రీ
స్వాతంత్ర్యం గురించి ప్రసంగమిస్తావ్
నీ ఇంట్లో ఆడవాళ్ళని అణగదొక్కుతావ్
వాళ్ళు నీకన్నా బాగుపడతారేమోనని నీకు
కుళ్ళురా!
7.
నువ్వు
పార్టీలకి వెళ్ళచ్చు; అయినా నువ్వు బుద్ధిమంతుడివి
అదే పని ఆడపిల్ల చేస్తే ఆమె బజారుదౌతుందట్రా!
నీకు బంధువులు, స్నేహితులైన స్త్రీలెంత
దురదృష్టవంతులో!
8.
ఓ
పురుషాహంకారీ! ఓ మగమృగమా!
ఇప్పుడైనా నీ స్కిజో ఫ్రేనియాని
తగ్గించుకో
మానసిక వైద్యుడి వద్దకు వెళ్ళు, స్త్రీలను
గౌరవించడం పాటించు!
9.
ఈ
ఆర్యోక్తులు పాటించరా, అందరి మన్ననలూ పొందుతావు!
పరనారీ సహోదరుడివి అవు
పరంగానా పుత్రుడవు అవు.
10.
ఓ దీనా!
నిన్ను అమ్మవారు పూనుగాక!
ఆదిశక్తివైన నువ్వు అణగదొక్కబడినదానివి
కాకూడదు
నిన్ను కష్టపెట్టే దుర్మార్గుల మదమణిచెయ్,
నువ్వు సబలవని నిరూపించుకో!
***
No comments:
Post a Comment