1.
నీవే మాకు విద్యాదాతవు
నీ
రూపాలన్నీ మాకు పవిత్రమే
చిన్నప్పుడు
పుస్తకాలు, కలం నీ ముందు పెట్టి నీ ఆశీర్వాదం కోరేవాళ్ళం
ఇప్పుడు
కంప్యూటర్, ట్యాబు, మొబైల్ వగైరాల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమంటున్నాం.
2.
ఒకప్పుడు మేము నిరక్షరాస్యులమై మూర్ఖంగా
ప్రవర్తించే వాళ్ళం
ఇప్పుడు
అక్షరజ్ఞానమున్న మూర్ఖులమయ్యాం
అక్షరాస్యత
పెరిగినందున మా సమాజంలో చెడు రూపుమాసిపోయిందా?
ఓ చదువుల
తల్లీ! చెడుని నిర్మూలించే జ్ఞానం పెంపొందించమ్మా!
3.
ప్రఖ్యాత విద్యాసంస్థలలో చదివినవారికి
మంచీ- మర్యాదా లోపిస్తున్నాయి
‘విద్యయొసగు
వినయంబ’నే వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నారు
ఆత్మవిశ్వాసానికీ,
గర్వానికి తేడా తెలియడంలేదు వాళ్లకి
ఓ చదువుల
తల్లీ! వాళ్ళు ఆ తేడాని తెలుసుకునే జ్ఞానం పెంపొందించమ్మా!
4.
మా చిన్నప్పుడు ఒకానొక అత్తాకోడళ్ళు కలిసుండరు అనే వాళ్ళు
అప్పట్లో మామూలు
అత్తాకోడళ్ళు కలిసుండేవారు అయిష్టంగా
ఇప్పుడు
మీరిద్దరూ సంతోషంగా కలిసుంటున్నారు కదమ్మా!
ఓ చదువుల
తల్లీ! అత్తాకోడళ్ళు కలిసుండే సామరస్య జ్ఞానం పెంపొందించమ్మా!
5.
పెద్దపెద్ద చదువులు చదివిన కొద్దీ మనుషులకి
విలువలు మృగ్యమవుతున్నాయి
స్వలాభం
కోసం వాళ్ళు మానవత్వానికి వీడ్కోలు పలుకుతున్నారు
మనుషులని,
మృగాలని, అడవులని నాశనం చేస్తున్నారు
ఓ చదువుల
తల్లీ! విలువలని పాటించే ఇంగిత జ్ఞానం పెంపొందించమ్మా!
6.
నీవు ప్రసాదించిన సంగీతం వీనుల విందు
చేసేది
ఇప్పటి తరానికి
సంగీతమంటే శబ్ద కాలుష్యం
దాని సాహిత్యం
కర్ణ కఠోరంగా ఉంటోంది
ఓ చదువుల
తల్లీ! సృజనాత్మకతకీ, అసభ్యానికీ తేడాని గ్రహించే జ్ఞానం పెంపొందించమ్మా!
7.
విద్యకీ, వ్యసనాలకీ దూరముండేది ఒక నాడు
ఈనాటి
విద్య వ్యసనాలకి సంఘం ఆమోదముద్ర వేసింది
చెడు
పనులను సగర్వంగా చెప్పుకునే సంఘమిది
ఓ చదువుల
తల్లీ! విద్య వల్ల వ్యసనం దూరమయ్యే జ్ఞానం పెంపొందించమ్మా!
8.
విద్యాబుద్ధులు నేర్పే గురువు దైవతుల్యుడు
ఆనాడు
విద్యని
వ్యాపారంగా మార్చిన ప్రబుద్ధులున్నారీనాడు
వ్యాపార
విద్య మనుషులని డబ్బు మనుషులని చేస్తోంది
ఓ చదువుల
తల్లీ! విద్యా ఔన్నత్యాన్ని పునరుద్ధరించే జ్ఞానం పెంపొందించమ్మా!
ఓ చదువుల తల్లీ! విద్యచే సమాజాన్ని బాగు చేసే
జ్ఞానం పెంపొందించమ్మా!
***
No comments:
Post a Comment