1.
స్వాతంత్ర్యమంటేవిదేశీయుల పాలన నుండి విముక్తిమాత్రమే కాదు
స్వాతంత్ర్యమంటే స్వదేశీయులకి
కడుపు నిండా అన్నం దొరకడం
స్వాతంత్ర్యమంటే భారతీయులకు
తమ వారి దోపిడీ నుండి విముక్తి లభించడం
అర్థ రాత్రి స్త్రీ ఇంట,
బయటా క్షేమంగా ఉండడం
చిన్నపిల్లలకి వాళ్ళ బాల్యం
లభించడం
2.
ఏసీ కారులో ప్రయాణించే ఓ ధనికుడా!
ఒక్క సారి ఆత్మవలోకనం
చేసుకో
నీ కారు సక్రమమైన ఆర్జనతో
కొన్నదేనా? ఓహో, సక్రమమైనదేనా?
నీ పిల్లకాకపోతేమాత్రం, ఆ
పసికూన ఈ వయసులో పొట్టపోసుకోవలసి వస్తోందంటే బాధగా లేదూ?
ఏదీ ఆ బాల్యపు స్వాతంత్ర్యం
అని అనిపించడం లేదూ?
డబ్బుతో నీ చర్మాన్ని మందం
చేసుకున్నావా?
లేదా? అయితే వెంటనే ఆ పిల్ల
చదువు సంధ్యల బాధ్యత తీసుకో
ఏదీ ఆ బాల్యపు స్వాతంత్ర్యం
అని అనుకునే బదులు, ఆమెకు బాల్యాన్ని బహుమతిగా ఇయ్యి.
No comments:
Post a Comment