1. మాకు స్వాతంత్ర్యం లేదు
మీ మనుషులు మమ్మల్ని కట్టేస్తారు
మా దూడల మూతుల కట్టి మా పాలను కాజేసి, కల్తీ చేసి అమ్మేస్తారు
మీ అసలు నైజం తెలియక మీరేదో మాకన్నా గొప్పవారనుకుంటాం.
2. మేమేమైనా తప్పు చేస్తే మమ్మల్ని గట్టిగా బాదుతారు
మంచి గొడ్డుకో దెబ్బ అంటారు
మీ మాట విని మేము మిగతా వారికీ అడ్డుపడకుండా నడుస్తాం
మరి మీరో?మంచి మనిషికో మాట అన్నారు కదా!
మరి మీరు మాటలతో వినే రకాలేనా?
మాలో మేం ఒకరితో మరొకరం పోటీ పడం
మీరు మాత్రం మీ జాతి వారితో పోటీ పడుతూ మిగితావారికి అడ్డు పడతారు
మీరు మాటలతో వినకపోతే ఏం చెయ్యాలి?
No comments:
Post a Comment