Tuesday, June 6, 2017

ఈ రోజు (romantic version)/ మారుతున్న కాలంలో ఏరువాక (futuristic version)

ఈ రోజు
రోహిణీకార్తె మృగశిరకు దారిచ్చి
తొలకరి చిందించే రోజు

వర్షాకాలం మొదలయ్యే రోజు
రైతు ఖరీఫ్ పంటల్ని నాటే రోజు
వచ్చే సంవత్సరానికి మిగతా ప్రజానీకానికి కూడా
ఆహారస్వావలంబనకై పాటుపడే మొదటి రోజు
 సకాల వర్షాలు పడి
అధిక దిగుబడికై కోరుకునే రోజు
రైతన్న జోడెడ్లతో నాగలి పట్టేరోజు...
ఈ రోజే ఏరువాక!
ఆహార దినుసులు దండిగా పండాలని కోరుకుందాం!
(ఇది రొమాంటిక్ వెర్షన్)
మారుతున్న కాలంలో ఏరువాక
ఏరువాక పూజ చేద్దాం
ట్రాక్టర్ తో పొలాన్ని దున్నేద్దాం
నదులపై ఆనకట్ట కట్టి,
మరే పద్ధతిలోనైనా
నిల్వ నీరు ఏర్పాటు చేసుకుందాం
ఇంకుడు గుంతలు తవ్వి
నీటి వనరులను సంరక్షించుకుందాం
పచ్చదనాన్ని కాపాడి పెంపొందిద్దాం
జంతువులకి ఆహారాన్ని పెంచుదాం!
ఏరువాకంటే కొత్త పంటకి
విత్తు నాటి నాంది పలుకడమే కాదు
కొత్త సాగు పద్ధతులకు
పునాది వేయడమన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం!
మన ఐశ్వర్యాన్ని పెంచుకుందాం
దాన్ని అందరితోనూ పంచుకుందాం!
****

No comments: