Tuesday, April 10, 2018

చిత్రకవిత- అల్పసంఖ్యాకులు


అల్పసంఖ్యాకులు
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి
చీకట్లో చిరుదీపం వెలిగించి
బండ రాళ్ళని పెళ్ళగించి
ఇంతింత-ఇంతింత బయటకు తెచ్చి
ఆ నల్ల బంగారాన్ని అప్పగిస్తే
అనుకున్నదానికన్నా జీతం తక్కువిచ్చి
నల్లధనాన్ని పెంచుకుంటారొకరు.


లోతుల్లోని ఖనిజాన్ని
బయటకు తీసేటప్పుడు
కొండ చరియలు విరిగి పడితే
ఆ పేద కార్మికుల ప్రాణాలను
రక్షించడానికి ఉపేక్షిస్తారు మరొకరు.

ఇంత కష్టపడినందుకు ఎవరూ
కోటీశ్వరులు అవరు
మాట్లాడుకున్న డబ్బు
ముడితే మురిసిపోయే
అల్ప సంతోషులు,
కాపీనం లేని
అల్పసంఖ్యాకులు.
***

No comments: