1.
అమ్మపోరుతో పాత పుస్తకాలు
సర్దడం మొదలుపెట్టిన నాకు
కనిపించింది వాటి మధ్య ఓ
నెమలీక
ఆ ఈక తెచ్చిన మధురమైన జ్ఞాపకాల సవ్వడిలో
నా మనసు నెమలిలా నాట్యమడగా
సర్దుడు చెట్టెక్కె, అమ్మ నన్ను తిట్టె!
2. చెదలు పట్టిన నా ఫోటోల అరను
శుభ్రము చేయ, చూసితి
చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు
వాటి సవ్వడిలో మనోమయూరము
నాట్యములాడ, వంట చేయుట
మరిచితినక్కటా!
3. ప్రేమ తగ్గిన కాపురమున
విసిగియున్న నేను
విడిపోవలెనని నిర్ణయించి
అలమరా తెరిచిన వెంటనే కనబడె
మా పెళ్ళి ఫోటోల యాల్బం
ఆ మధురమైన జ్ఞాపకాల సవ్వడిలో
నా పెళ్ళికి మరో అవకాశమివ్వ తోచెన్.
4. ఉడా పార్కులో కూర్చుని
సాయంకాలపు పిల్లగాలిని ఆస్వాదిస్తున్న
నాకు
కనిపించెనొక నడివయసు స్త్రీ
ఆమెను గుర్తుపట్టగానే
మా ఇరువురి బాల్యకాలపు
మధురమైన జ్ఞాపకాలు సవ్వడి చేసె.
5. పండుముసలియైన నాకు
తోడు-నీడ ఆ దేవుడే!
ఆయనిచ్చిన మధురమైన జ్ఞాపకాల సవ్వడి
ఉండగా నా గుండెకేం భయం!
***************
No comments:
Post a Comment