Monday, August 20, 2018

స్వీయ కవిత- Theme- జల ప్రళయం -జన జీవనం కకావికలం- ప్రకృతి విలయతాండవం


ప్రకృతి విలయతాండవం
మానవులు వరదల వల్ల కష్టపడుతున్నారని బాధపడేవడా!
ఓ మానవుడా! వారి కష్టానికి కారణమెవ్వరు?
కొండలను పిండి చేసే యంత్రాలున్నాయని భుజాలెగరేసిందెవరు?
వాటిని పనిలోపెట్టి గొప్పలు కొట్టుకున్నదెవరు?

భూమాతని గౌరవింపక విలువకట్టిందెవరు?
పచ్చదనాన్ని పారద్రోలి, కాంక్రీటు అడవులు నిర్మించిందెవరు?
ప్లాస్టిక్ ని సృష్టించి, వాడకంలోకి తెచ్చిందెవరు?
బళ్ళో నేర్చుకున్న పర్యావరణపు చదువు కీకరకాయైనదెవరికి?
పచ్చదనాన్ని పోగొడితే నీళ్ళు ఇంకడానికి స్థలం సరిపోదని తెలియనిదెవరికి?
తనకు లభాలున్నంత కాలం భూమాతను కుళ్ళపొడిచేదెవరు?
ఓ అంధ మానవుడా? ఇన్ని ప్రశ్నలకి నువ్వే, నువ్వొక్కడివే సమాధానం....
ఇప్పుడు ఇన్ని ప్రాణాలు పోయాయని ఎందుకా మొసలి కన్నీరు?
ఓ, నీదాకా వచ్చిందనా? ఇది నువ్వూహించలేదు కదూ!
మనుషులకన్నా, మీ భూ-సహచరులు, జంతువుల్లో ఎక్కువ మంది
అసువులు బాసారని తెలుసా?
జంతువుల అవాసాలు కూల్చినప్పుడు, వారిని నిర్వాసితులని చేసినప్పుడు ఏడవలేదు కదా!
మరి మీ ఇళ్ళలోకి నీళ్ళు వస్తే ఎందుకు ఏడుస్తున్నారు?
మీలాంటి స్వార్ధపరులున్న కాలంలో పుట్టి-గిట్టినందుకు
ఆ జంతువులేడ్చాయిట, వినబడలేదా?
అటవిక న్యాయంతో బాటు మనుషుల అన్యాయాన్ని కూడా
భరించాల్సి వస్తోంది వారికి పాపం!
జన్మనిచ్చిన తల్లిని చిత్రహింసలు పెడితే, ఆమె తిరగబడితే,
దాని పేరే “ప్రకృతి విలయతాండవం”!
ఇకనైనా బుద్ధి తెచ్చుకో!
పర్యావరణాన్ని రక్షించి,
మెరుగు పరచుకో!
*****************

No comments: