నేను- నాది
తొమ్మిది నెలలు కడుపులో
కాపాడి
స్వావలంబన వచ్చే వరకూ తమ రెక్కలతో
నన్ను రక్షించిన
తల్లిదండ్రులని నేనిప్పుడు పట్టించుకోనోచ్!
ఎందుకంటే, ఇప్పుడు నా కాళ్ళ
మీద నేను నిలబడుతున్నా కదా!
కన్నాక వాళ్ళు నన్ను పెంచక
మానరు కదా!
నా పిల్లలకి ఒంట్లో
బాలేకపోతే నేను జాగారం చేస్తా
మా అమ్మానాన్నా కూడా నాకోసం
చేసుంటారు
అయినా, నాకెందుకు? నాకు
నేను- నా వాళ్ళు ముఖ్యం
ఆ నా వాళ్ళలో మా
అమ్మానాన్నలు లేరన్నది తథ్యం!
మరో ఇరవై ముప్ఫై ఏళ్ళకి
నేనూ ముసలైతే
నా పిల్లలు నన్ను చూడకుండా,
నా ఆస్తి కాజేసి నన్ను రోడ్డున
వదిలేస్తే,
వీళ్ళిలా చేశారేమిటని నేను
బాధ పడితే,
దానిక్కారణం నేనేనని
గ్రహించే శక్తి నాకుందా?
నా ‘నేను- నాది’ అనే
స్వార్థం దాన్ని పడనిస్తుందా?
**************
No comments:
Post a Comment