Sunday, November 6, 2016

భిన్నత్వంలో ఏకత్వం




1.     పంజాబులో భాంగ్రా
బెంగాలులో  బిహూ
ఒకటేమిటి, ఒక్కొక్క రాష్ట్రానికీ తనకంటూ ఒక ప్రత్యేక నృత్యముంది.


2.     తమిళనాడులో గూడ పంచెకట్టు
రాజస్థానీయుడు తలపాగా పెట్టు
లెక్క చూస్తే రెండు మూడు రకాలే గానీ తరచి చూస్తే వేర్వేరు కట్టూ-బొట్టూ!

3.     ఒక రాష్ట్రంలో వేడి గాలి బెలూన్
మరొక చోట గాలిపటం
తమకిష్టమైన కాలక్షేపాలు సృష్టించుకున్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు.

4.     ఇన్ని రాష్ట్రాలు , ఇన్ని సంస్కృతులు
ఇన్ని నృత్యాలు, ఇన్ని సంగీత శైలులు
వెరసి చూస్తే ఒకటే భారతీయత
అదే మన భిన్నత్వంలో ఏకత్వం


***

No comments: