Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Wednesday, June 5, 2019

చిత్రకవిత- రాజంటే...



రాజంటే...
రాజంటే... నలుగురు గుర్తించాలేమిటి, నేను మనసులో అనుకుంటే చాలదూ!
రాజంటే... నెమలి సింహాసనం ఉండాలేమిటి, ఓ నాలుగు ఇటుకలు సరిపోవూ!

చిత్రకవిత- అసలు, నువ్వు మనిషివేనా?


అసలు, నువ్వు మనిషివేనా?
మీదో సంపన్న దేశం
అందుకే ఓ ఖరీదైన కెమెరా కొనుక్కోగాలిగావు
ప్రపంచంలో వింతలూ-విశేషాలూ చూడ్డానికి బయల్దేరావు
అక్కడితో ఆగచ్చు కదా!
ఊహూఁ, పేదరికానికి ఫోటో తీద్దామని వెళ్ళావు
పేగులు కనిపిస్తున్న పిల్లని చూసి పొంగిపోయావు
ఆమె వెంట కాచుకుని కూర్చున్న రాబందుని గమనించి ఉబ్బితబ్బిబ్బయ్యావు
అసలు నువ్వు మనిషివేనా?

Thursday, May 23, 2019

చిత్రకవిత- మరక మంచిదే!


మరక మంచిదే!
ఏడాదికి తొమ్మిది నెలలు
సోమరితనం లేకుండా
పని చేసుకుంటూ ఉన్నప్పుడు,

Wednesday, May 22, 2019

చిత్రకవిత-ఆమ్లాసురుడు చూసి కుళ్ళుతో కళ్ళు మూసుకునేవాడవడూ?


ఆమ్లాసురుడు చూసి కుళ్ళుతో కళ్ళు మూసుకునేవాడవడూ?
నన్ను చూసి కొందరులిక్కి పడతారు
మరి కొందరు మొహం తిప్పుకుంటారు
వారి చేష్టలు ఒక దుర్మార్గుణ్ణి సంతోష పెడతాయి
అదే, వాడే, నా ముఖం మీద ఆమ్లం పోసిన అసురుడు

Saturday, April 27, 2019

చిత్రకవిత- ప్రకృతి ఒడిలో...



ప్రకృతి ఒడిలో...

వాళ్ళకి వేసుకోవడానికి బ్రాండెడ్ బట్టలు లేకపోవచ్చు
ఎండ నుండి తల దాచుకోవడానికి గొడుగుల్లేకపోవచ్చు
ఆడుకోవడానికి విలువైన బొమ్మలు లేకపోవచ్చు.

Monday, August 20, 2018

స్వీయ కవిత- Theme- జల ప్రళయం -జన జీవనం కకావికలం- ప్రకృతి విలయతాండవం


ప్రకృతి విలయతాండవం
మానవులు వరదల వల్ల కష్టపడుతున్నారని బాధపడేవడా!
ఓ మానవుడా! వారి కష్టానికి కారణమెవ్వరు?
కొండలను పిండి చేసే యంత్రాలున్నాయని భుజాలెగరేసిందెవరు?
వాటిని పనిలోపెట్టి గొప్పలు కొట్టుకున్నదెవరు?

Monday, August 13, 2018

స్వీయ కవిత- Theme- వృద్ధాప్యంలో తల్లితండ్రుల పట్ల పిల్లల బాధ్యత, నేటి పరిస్థితి- నేను- నాది


నేను- నాది
తొమ్మిది నెలలు కడుపులో కాపాడి
స్వావలంబన వచ్చే వరకూ తమ రెక్కలతో
నన్ను రక్షించిన తల్లిదండ్రులని నేనిప్పుడు పట్టించుకోనోచ్!
ఎందుకంటే, ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా కదా!
కన్నాక వాళ్ళు నన్ను పెంచక మానరు కదా!

Monday, August 6, 2018

స్వీయ కవిత- Theme-మధురమైన జ్ఞాపకాల సవ్వడిలో


1.     అమ్మపోరుతో పాత పుస్తకాలు
సర్దడం మొదలుపెట్టిన నాకు
కనిపించింది వాటి మధ్య ఓ నెమలీక
ఆ ఈక తెచ్చిన మధురమైన జ్ఞాపకాల సవ్వడిలో
నా మనసు నెమలిలా నాట్యమడగా
సర్దుడు చెట్టెక్కె, అమ్మ నన్ను తిట్టె!

Wednesday, August 1, 2018

చిత్రకవిత- ఆరోగ్యకరమైన బాల్యం


ఆరోగ్యకరమైన బాల్యం
ఆటంటే బయటే!
గోళీలాట కావచ్చు
గిల్లీ డండా కావచ్చు
పరుపందేలు కావచ్చు
కోతి కొమ్మచ్చి కావచ్చు

Saturday, July 28, 2018

గద్య పూరణము- “ఊహల ఊయల వూగెనుగా .. “

1.    ఊహల ఊయల వూగెనుగా .. “ అంటూ
ఓ కర్ణకఠోర గాత్రం గొంతెత్తి పాడితే
సభలోని జనాల ఊహలు ఆవిరై
వాళ్ళని పారిపొమ్మని ఉసిగొల్పాయి!
  

Monday, July 23, 2018

స్వీయ కవిత- Theme-వరకట్న(ష్ట)ము- అసలు వాళ్లకి పెళ్ళౌతుందా?


అసలు వాళ్లకి పెళ్ళౌతుందా?
ఓ ఆడపిల్ల సందిగ్ధం:
నేను కొనుక్కున్న సీడీ
నాక్కావలసిన పాటలు పాడుతుంది
నేను కొనుక్కున్న కారు
నాక్కావలసిన చోటికి తీసుకు వెళ్తుంది
వీటి కన్నా ఖరీదుపెట్టి కొనుక్కోబోయే
భర్తతో సర్దుకుపొమ్మంటుంది మా అమ్మ,
అదేమి చోద్యమోగాని!

Sunday, July 22, 2018

చిన్న పిల్లని చూసి ....(గల్పిక)

చిన్న పిల్లని చూసి ....(గల్పిక)
              హోరు వాన కలిగించిన రోడ్డు వరదలు దాటుకుని, ఎలాగో ట్రెయిన్ ఎక్కాం నాన్నా, నేనూ! మా ఎదురు సీట్లో భార్యాభర్తలు, వాళ్ళ కూతురూ కూర్చున్నారు. నా దృష్టి చంటిపిల్లైన వాళ్ళమ్మాయి మీద పడింది. ఎంత ముద్దుగా ఉందో! సీరియస్ గా స్మార్ట్ ఫోనులో ఏదో వీడియో చూస్తూ కన్నడంలో వాళ్ళమ్మానాన్నలతో ముద్దు ముద్దుగా మాటలాడుతోంది. రెండేళ్ళు కన్నా ఉండవు. ఎంచక్కా స్మార్ట్ ఫోన్ ని వాడుతోందో! 

Friday, July 20, 2018

స్వీయ కవిత- Theme- ధనము-మానవత్వము- ఇవేం రోజులురా బాబూ!


ఇవేం రోజులురా బాబూ!
ఏవా రోజులు?
ధనవంతులు దానకర్ణులనే
పేరుకోసం పాకులాడిన రోజులు
మనకున్న దానిలో నలుగురి కడుపులూ
నింపాలనుకున్న రోజులు?

Tuesday, July 17, 2018

చిత్రకవిత- వానొస్తే...



వానొస్తే...
మండుటెండలు చెరిగేసే ఈ దేశంలో వానొస్తే ఎంతో హాయి
వాన తెచ్చే చల్లదనం కోసం ఎదురు చూస్తూ గడిపేస్తాం ఎండా కాలాన్ని
వానొస్తే మనకు మాత్రమేనా ఆనందం?

Sunday, July 15, 2018

స్వీయ కవిత- Theme- అంతర్జాల మాయాజాలంలో చిక్కిన మనీషి- సర్వం మాయే


సర్వం మాయే
వ్యసనాలకు దూరంగా ఉండే మనుషులు కూడా
ఈ మయాజాలంలో చిక్కుకుంటున్నారు
ముందు ఒక సౌకర్యంలా ఉద్భవిస్తుంది
తరువాత మరిన్ని సౌకర్యాలందిస్తుంది
అవీ, ఇవీ చూడమని ఉప్పందిస్తుంది
వాటి చుట్టూ ఒక ఉచ్చు బిగించి ఊపిరాడకుండా చేస్తుంది

Wednesday, July 11, 2018

చిత్రకవిత- ఓ యువతా, మేలుకో!



ఓ యువతా, మేలుకో!
ట్రెండీ బట్టలు వేసుకుని అంతా కులాసా అనుకోకు
దీపాల మిణుకు చూసి వెలుగనుకోకు
సంధ్యను చూసి పొంగిపోకు
అది వేకువో సాయంత్రమో తెలుసుకో!

Wednesday, July 4, 2018

చిత్రకవిత- ఊగిసలాడే ఈ బ్రతుకు




ఊగిసలాడే ఈ బ్రతుకు

ప్రతి రోజూ పొద్దున్నే బండేసుకు నాబోటి వారిళ్ళలో
ప్లాస్టిక్ సామాన్లు అమ్మజూస్తా
ఒక్కో రోజు మంచి బేరాలు తగుల్తాయి,
మరో రోజు పెట్రోలు ఖర్చు, పస్తులు!

Monday, July 2, 2018

చిత్రకవిత- పొగ వదలకు- ప్రాణాన్ని వదులుకోకు




పొగ వదలకు- ప్రాణాన్ని వదులుకోకు
‘నేను గురజాడ వారి అభిమాని’నని
గిరీశాన్ని ఆదర్శంగా తీసుకునే ఓ వెర్రి కుర్రవాడా!
గిరీశం ద్వంద్వ ధోరణి మరిచావా?
‘కన్యాశుల్క’పు వ్యంగ్య వైభవాన్ని విడిచావా?
ధూమపానం చేయకపోతే దున్నపోతై పుట్టుదువు గాక!
కాన్సర్ రోగిలా చచ్చి బతక్కు!

స్వీయ కవిత- Theme- "యువతరం ప్రేమాయణం"--- ఆన్లైన్ ప్రేమ


ఆన్లైన్ ప్రేమ
మొదటి రోజు ఛాటింగు
రెండో రోజు డేటింగు

Wednesday, June 27, 2018

స్వీయ కవిత- Theme-"విదేశీ విద్యా మోజు.......అక్కడ నానా కష్టాలే ప్రతి రోజు"- కష్టే ఫలే


కష్టే ఫలే
విదేశీ విద్యంటే ఎందుకుండదు మోజు?
ఈనాటి మన దేశపు చదువులు మనకు మనోవికాసం కలిగిస్తాయా?
కష్టపడి చదివేవాడికి సరైన ప్రోత్సాహం ఉంటోందా?
వాడి ప్రతిభకు తగ్గ ఉద్యోగం వస్తోందా?
పరీక్షల సీసన్ లో ఏ వార్తా పత్రిక తిరగేసినా, కాపీలు కొట్టే వారి కథలే
చదివినా చదవకపోయినా పై తరగతికి వెళ్ళిపోయి, చదువొచ్చినట్టు భుజాలు ఎగరేయడమే!
ప్రతిభను గుర్తించని చదువు నాకొద్దు