Saturday, April 27, 2019

చిత్రకవిత- ప్రకృతి ఒడిలో...



ప్రకృతి ఒడిలో...

వాళ్ళకి వేసుకోవడానికి బ్రాండెడ్ బట్టలు లేకపోవచ్చు
ఎండ నుండి తల దాచుకోవడానికి గొడుగుల్లేకపోవచ్చు
ఆడుకోవడానికి విలువైన బొమ్మలు లేకపోవచ్చు.


ఉండడానికి చలి మర గదులులేవు
పెరగడానికి విలాసాల్లేవు
అయినా, ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుకుంటున్నారు.

లేత అరిటాకే గొడుగుగా
పచ్చని అడవే ఆటస్థలంగా
బ్రతుకుతెరువు ఇచ్చే పనే ఆటగా...
ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుకుంటున్నారు.
****



No comments: