Tuesday, December 27, 2016

పెళ్ళంటే?



1.     పెళ్ళంటే ఖరీదైన దుస్తులు, నగలు కాదు
పెళ్ళంటే అవగాహన అనే ఒక పవిత్ర బంధం

Wednesday, December 21, 2016

ఓ మనిషీ ఏం చేస్తున్నావీ భూమిని?



అప్పుడు-
పచ్చని చెట్లలో రకరకాల పక్షుల గూళ్ళుండేవి
ఇరు సంధ్యల్లో కిలకిలా రావాలు వినిపించేవి

Tuesday, December 13, 2016

పచ్చదనంతో చేయి కలపవోయ్




1.     భూమి వేడెక్కుతోందని గోలపెడితే చాలదోయ్
ఆ వేడికి ఆవిరి పోసిన నీ ఏసీని గుర్తు తెచ్చుకో!

Wednesday, December 7, 2016

స్వార్థం పోయేదెప్పుడు?

1.    



పసుపు, ఎరుపు రంగుల కలయికే సంధ్య
ప్రాతస్సంధ్యైతే అది ఒక రోజుకి శుభారంభం
ఎన్నో ఆశలు ఫలించడానికి మొదటి మెట్టు
పక్షులు పొట్టకూటికి బయలుదేరే సమయమది.

Saturday, December 3, 2016

Litmus Tests

(published in an in house magazine)
This is stylized version of a few real life incidents, narrated in the first person.

***
               The ‘tring tring’ sound distracted me from my computer. I was trying to shoot a bug for the past two hours in vain. I took my sight off the monitor and transferred it to the mobile. A cheerful, familiar face smiles at me, with its name, ‘Ravi’, superscribed on the top. At 16:15hrs, it was quite unusual for Ravi to call me. I wondered what would have gone wrong.

Wednesday, November 30, 2016

చిన్నతనపు చిన్న చిన్న ఆనందాలు


1.     చిన్నతనమంటే గుర్తొచ్చేది నేను గెలుచుకున్న బంగారు పతకం కాదు
అమ్మానాన్నలకు తెలియకుండా వానలో నేను తడిసి ముద్దైన మదుర క్షణాలు!

భవిష్యత్తుకి బంగారు బాట



1.     నిన్ను ఎక్కువ రోజులు చదివించలేనురా,
అని వాపోయింది నా నిస్సహాయ మాతృమూర్తి.
వచ్చి వేన్నీళ్ళకి చన్నీళ్ళుగా ఉండమంది.
తల్లికి సాయపడడం కన్నా నాకు కావలసిందేమిటి?

Wednesday, November 16, 2016

ఆ నవ్వుల కోసమే


1.     ఆనాడు అభిమానంతో పలకరించిన నీ చిరునవ్వు
చేసుకుంది నా మనసుని నీ వశం
నిండుగా నవ్వే నీ చందమామ ముఖం
చూసి మైమరచిపోవడమే ప్రేమికుడిగా నా ఘనకార్యం.

Sunday, November 6, 2016

భవిష్యత్తుకి పునాది


1.     అక్షరాలు దిద్దితే సంతోషం
ఏదో కొత్త పని చేస్తున్నామని
సరిగ్గా వ్రాశామని ఆనందం

భిన్నత్వంలో ఏకత్వం




1.     పంజాబులో భాంగ్రా
బెంగాలులో  బిహూ
ఒకటేమిటి, ఒక్కొక్క రాష్ట్రానికీ తనకంటూ ఒక ప్రత్యేక నృత్యముంది.

స్వార్జితం


ఒక తల్లి ఆవేదన:
చిన్నారి నా చిట్టి నా తాహతుకు మించిన బహుమతి కోరింది
బోరింగు నుండి నీళ్ళు తెస్తే నెల రోజుల్లో కొనిస్తానన్నాను
ఆమె సంతోషంగా అంగీకరించింది
ఉత్సాహంగా ఆమె మోయగాలిగిన బిందెతో నీళ్ళు తెచ్చింది
అందుకోసం ఎక్కువసార్లు చక్కర్లు కొట్టింది

Wednesday, October 19, 2016

సూర్యుడు- వెన్నెల

సూర్యుడు- వెన్నెల
1.     తాను మారుజన్మనెత్తి నాకు జన్మనిచ్చింది
పాలతో నాకు బలాన్ని పంచింది
ఆటపాటలపై ఆసక్తి పెంచింది
విద్యాబుద్ధులు నేర్పి నా వ్యక్తిత్వం రూపు దిద్దింది

Wednesday, October 12, 2016

చదువుల తల్లి మినహాయింపు

చదువుల తల్లి మినహాయింపు
1.     బ్రహ్మ, బ్రహ్మాణి సంభాషణ:
బ్రహ్మ: ఓ హంసవాహినీ, నేను సృష్టించిన ఆడబొమ్మ కలిగించె నాకు మనస్తాపమున్
        పాపమందాల ఆ కుందనపు బొమ్మ సంచిత కర్మానుసారం నిర్భుజయై జన్మించున్!
        ఏకసంతాగ్రాహియౌ ఆమె తన తెలివితేటలనెట్లు వృద్ధి చేయున్?
        పురుషాధిక్య సమాజమునన్ గౌరవప్రదంబుగ నెట్లు జీవించున్?

Friday, May 20, 2016

ద్విగుణీకృతం


          ఆ రోజు ఫలితాలు వెల్లడౌతాయని తెలుసు. కానీ, సమయం తెలియదు. అలాగని నాలో ఆదుర్దా పెరగలేదు. బహుశః అది నా పరిణితికో, లేక నా పాండిత్యలేమికో చిహ్నమేమో! మరి, ఆ పరిణితి నేను చిన్నప్పుడే పొందానేమో! సాధారణంగా ఫలితాల రోజు నన్ను భయపెట్టేది కాదు. నేను ఆశించిన విధంగా మార్కులు రాకపోతే బాధపడేదాన్ని. అదెవరైనా పడే బాధే కదా! అందులో గొప్పేముంది?

Thursday, March 31, 2016

మాతృస్వామిక కుటుంబం


"మా డిపార్టుమెంటులో పెద్దాయనతో మాట్లాడానోయ్. నా బదిలీ విషయంలో సాయం చేస్తానన్నారు", అన్నాడు అనిల్. హరిత సంతోషంగా, "అలాగా, ఆ కనకమ్మ దయవల్ల అదే త్వరలో అయితే మన కష్టాలు తీరినట్టే, అని అత్తయ్య అంటున్నారు", అంది.
"పిల్లలు ఇవ్వాళ కూడా పడుక్కున్నారా?"
"పడుక్కోరు మరి? రాత్రి పదకొండు కావస్తూంటే?"
"సారీ హరీ, రేపైనా వాళ్ళతో స్కైప్ లో చాట్ చేస్తా, సరేనా?"
"'రేపు' అని బోర్డు మీద వ్రాసినట్టే వుంది నీ వరస చూస్తుంటే! అత్తయ్య కూడా నీతో మాట్లాడాలని ఉబలాట పడుతున్నారు".
"సరే, తప్పకుండా! ఇలా ఫోన్లో కాకుండా నీతో లైవ్ గా గుడ్ నైట్ చెప్పాలనుంది".
"అనిల్, అమ్మవారికి ప్రార్థించు".
"నాలుగు రోజులు సెలవు పెట్టి ఇక్కడికి రాకూడదూ?"
"అత్తయ్య పిల్లల్ని చూసుకోలేక పోతున్నారు. పోనీ మా అమ్మ దగ్గర వదులుదామంటే ఆవిడకి టైఫాయిడ్ వచ్చి తగ్గిందికదా. ఇప్పటికీ వంటా అవీ నేనే చూసుకుంటున్నాను. నాన్న ఆవిడకి సపర్యలు మాత్రమే చేయగలుగుతున్నారు! రొటీన్ పనులకే ఇంత కష్టంగా వుంటే నువ్వు అక్కడికి రమ్మంటావేమిటి? ఇంక హాయిగా నిద్రపో. గుడ్ నైట్".
*****

Saturday, March 26, 2016

In the lap of Nature in Spring

Happened to spend some time with Nature a couple of weeks back……

I seemed to be the live example of the poems, Stopping by the Woods on a Snowy Evening and Leisure.

Friday, March 4, 2016

నడమంత్రపు సిరి


పన్నీరు చల్లడానికి రెడీగా ఉన్నట్టుంది ఆ మధ్యాహ్నపు ఆకాశం. వరలక్ష్మీ వ్రతం రోజు శ్రావణ మేఘాలు వర్షిస్తే అమ్మవారి ఆశీస్సులు అందుతాయని కొందరు నమ్ముతారు. వాళ్ళలో విశాఖపట్నంలో ఒక మూడు వాటాల ఇంట్లో ఉండే ముగ్గురు మధ్య తరగతి స్త్రీలు ఉన్నారు. మొదట వాళ్ళందరిలోనూ చిన్నదైన సవిత పెరట్లోకి వెళ్ళింది, బట్టలు తీయడానికి. రెండు గంటల సమయంలో పనిమనిషి ఉండదుగా! తరువాత వచ్చిన వనిత, బట్టలు తీస్తూనే, “ఏం, సవితా! పూజంతా చక్కగా అయినట్టేనా? ఎన్ని ఐటమ్స్ నైవేద్యం పెట్టావేమిటి?” అని అడిగింది. “ అబ్బే, మూడే వనిత వదినా!” అని సవిత జవాబిచ్చింది. “ఏమిటీ, మీరు వచ్చే ఏడాదికి ముచ్చటగా ముగ్గురవాలనా?” అని వనిత అడిగితే, “అంతకన్నా వేరే భాగ్యముందా?” అంది సవిత. ఆ మాటలతోటే ఆలోచనలో పడింది. ఇప్పటికి తనకి రెండు సార్లు గర్భం నిలువలేదు. తన భర్త సారంగ్ మెకానికల్ ఇంజినీర్. అది ఆర్ధికమాంద్య కాలం కనుక అతను పనిచేసే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులందరికీ జీతాలు తగ్గించబడ్డాయి.  వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఎదుగూ- బొదుగూ లేని జీవితం అంటే విసిగిపోయి, వాళ్ళు ఒక జాతకబ్రహ్మని ఆశ్రయించారు. ఆయన వాళ్ళ ఇద్దరి జాతకాలూ చూసి, వచ్చే అమావస్యకి సవిత నక్షత్రానికి పట్టే సూర్య గ్రహణం తరువాత వాళ్ళ చీకటి జీవితంలో వెలుగులు చోటు చేసుకుంటాయని జోస్యం చెప్పాడు. ఆ మంచి రోజులకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు.

Tuesday, February 16, 2016

'గొప్ప'దనం


అనగనగా మధ్యతరగతి కుటుంబం, ఇద్దరే ఆడపిల్లలు. చిన్నప్పటి నుండీ పెద్దమ్మాయి వేదవతిది పోటీ తత్త్వం. తనకు కొన్నలాంటి బట్టలే చెల్లెలికి కొనాలని పట్టుబట్టేది (అంటే, అది తన ఎంపిక అని; పైగా, ఎవరైనా మెచ్చుకోకపోతే ఎంచక్కా తన చెల్లి మీదకి నెట్టెయ్యచ్చు). తనకి కాలేజీ లెక్చరర్ వర్ధన్ తో పెళ్ళి అయ్యింది కనుక తన చెల్లెలైన పద్మావతికి కంపెనీ మేనేజర్ సంబంధాలు చూడకుండా అడ్డుపడి, మరో కాలేజీ లెక్చరర్ తో పద్మ పెళ్ళి జరిగేలా చూసింది. వర్ధన్ వాళ్ళింట్లో ఒక్కడే కొడుకు; మంచి ఆస్తిపరులు కూడా! నసపెట్టని అత్తమామలు, వేదని అపురూపంగా చూసుకునేవారు. ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ పద్మ భర్త వేంకట్ కి ముగ్గురు అక్కలు. అత్తగారు లేకపోయినా అతను ఇంటి ఆడబడుచులకి విలువనిచ్చేవాడు. అందువల్ల, పురుళ్ళకనీ, పుణ్యాలకనీ వాళ్ళ కుటుంబాల రాకపోకలుండేవి. పైగా అంత ఆస్తిపరులు కారు. అందుచేత బ్రతుకు బండిని ఈడవడం కష్టంగా వుండేది. వేదకు అవినాష్, అనూహ్య పిల్లలు. మగబిడ్డను కన్నందుకు వేదకి అత్తమామలు గచ్చిబౌలిలో ఎనిమిదొందల గజాల స్థలం బహుమతిగా ఇచ్చారు. ఎలాగూ బాధ్యతలు తప్పవు కనుక ఉద్యోగం మానుకున్న పద్మ, అనూహ్య వయసుదైన అలేఖ్యతో సరిపెట్టుకుంది. తమ ఆర్ధిక స్థోమతు ఎక్కువని, రెండు కుటుంబాలకీ వారసుడు తనకే పుట్టాడని గర్వపడే వేద, తన స్నేహితులతోనూ, అత్తింటి చుట్టాలతోనూ గొప్ప చెప్పుకుని మురిసిపోతూ వుండేది.
***

Monday, February 15, 2016

దేవుడిచ్చిన పండు


"అమ్మా, ఈ లిటిక్కాయని నేను తింటున్నాను", అంది ఏడేళ్ళ ధృతి, సంధ్యాదీపం పెడుతున్న వాళ్ళమ్మ లావణ్యతో. దీపం పెట్టాకతులసమ్మ కోసమని ఓ వెలిగించిన అగరువత్తుని తీసుకెళ్తున్న లావణ్య, "ఏ లిటిక్కాయ? మన ఇంట్లో అంత చిన్న కాయలు లేవే?" అని గొణుక్కుంటూ తులసి కోట కేసి నడవసాగింది. "ఇదిగో!" అని ఓ అరగంట ముందు గుడిలో అర్చన చేసినప్పుడు ఇచ్చిన అరటిపండును చూబిస్తూ దారికడ్డం పడింది ధృతి. "కొంచెంలో చెయ్యి కాలి ఉండేది. ఏమిటీ వేషాలు?" అని కూతుర్ని కోప్పడి, ఆ పండును చూసి, "ఇది దేవుడిచ్చిన పండు. దాన్ని లిటిక్కాయ అనకూడదు. అందరితోనూ పంచుకోవాలి, అంటే పైడమ్మతో సహా," అని నీతి ఉపదేశించింది లావణ్య.