Wednesday, December 21, 2016

ఓ మనిషీ ఏం చేస్తున్నావీ భూమిని?



అప్పుడు-
పచ్చని చెట్లలో రకరకాల పక్షుల గూళ్ళుండేవి
ఇరు సంధ్యల్లో కిలకిలా రావాలు వినిపించేవి

చెట్ల తొర్రల్లో ఉడుతలు హాయిగా ఆడుకునేవి
మెండైన నీడనిచ్చే ఆ చెట్లు మనుషులకీ, పక్షులకీ రుచికరమైన పళ్ళిచ్చేవి
పచ్చని పైర్లు కళ్ళకింపుగా ఉండి, మనుషుల, పశువుల ఆకళ్ళు తీర్చేవి.
మా వూరి ఏరులా మా పశువులు ఎల్లప్పుడూ బోలెడన్ని పాలిచ్చేవి

ఇప్పుడు-
మోడు వారిన చెట్టు గబ్బిలాలకి నెలవయ్యింది
పక్షుల సంగీతం విని చాలా కాలమయింది
ఉడుతలు తిండి దొరక్క వలసపోయాయి
మోడు వారిన చెట్టుకి పళ్ళు కాస్తాయా?
బీడు వారిన భూమి అకలి తీర్చగలదా?
బక్క చిక్కిన పశువులు ఎన్ని పలనివ్వగలవు?


ఓ మనిషీ ఏం చేస్తున్నావీ భూమిని?
సాగుభూమిని సిమెంటుకి రాసిచ్చేస్తావా?
పచ్చదనాన్ని నాశనం చేసి భూమి బీడువారిందని వాపోతావా?
పశువులకి కరువు సృష్టించి, పాలు ఖరీదయ్యాయని గగ్గోలు పెడతావా?

ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో
నీ స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయడం మానుకో
పచ్చదనాన్ని పెంచు, నీ మాతృభూమిని పచ్చగా ఉంచు!
*****

No comments: