Wednesday, March 29, 2017

ఉగాది స్పెషల్ చిట్టి (హాస్య) కథ-చాదస్తపు అత్త- గడుసరి కోడలు


        ఒక్కగానొక్క నలుసు ఎనిమిదేళ్ళ చింటూకి తలంటి, కొత్త బట్టలేసి, దేవుడికి దణ్ణం పెట్టించి, మామ్మ గారి చేతుల మీదుగా ఉగాది పచ్చడి తినమని పంపి పిండి వంటలకి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుంటోంది పల్లవి. వాడు చటుక్కున ఏడుపుతో తిరిగి వచ్చాడు. మామ్మ గారి గారాల మనవడెందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు పల్లవికి. “ఉగాది పచ్చడి నువ్వు చేస్తే బాగుండేది. ఈ మాటు అంతా చేదుగా ఉంది...” అని విషయం చెప్పి మళ్ళీ ఏడవ సాగాడు చింటూ.

Tuesday, March 28, 2017

వచ్చే ఉగాది పండుగ (part II -Free Verse)

1.     ఉగాది పండుగ వచ్చిందోయని
కొత్తకి స్వాగతం మాత్రం పలికితే చాలదు
మనలో ఉండే చెడుని విడిచి
కొత్త జీవితం ఆరంభించాలి.

Sunday, March 26, 2017

చిట్టికథ వాక్యం-(keywords) "నేనెవరో మీకు తెలియకపోయినా...మీరెవరో నాకు తెలుసు.మనిద్దరి పరిచయం ఈనాటిది కాదు". ----ఆశ్చర్యం

ఆ ఏరియాకి కొత్తగా వచ్చినట్టు ఆమె బెరుకుతనం చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది. బిక్కమొహం వేసుకుని బిత్తర చూపులతో అటూ ఇటూ చూస్తూ ఎలాగో బస్సు స్టాప్ కి చేరుకుంది. పావుగంటైనా ఇంకా బస్సు రాలేదు.

Saturday, March 25, 2017

వచ్చే ఉగాది పండుగ (part I -Metered Poetry)

Sagara Teeram wishes readers a very happy Ugadi in advance! May u n urs be blessed in Hevilambi!

వచ్చే ఉగాది పండుగ
1.     ఆ. వె. కోకిలమ్మ కూసె కొత్త వత్సరమొచ్చె
        మావి కొమ్మ పూసె మావిగాసె
        పూల పరిమళాల పుడమి పులకరించె
        జనుల చింత తీరె జగము నందు||

Wednesday, March 22, 2017

ఆమనికి స్వాగతం


కొత్త చిగుళ్ళు తొడిగిన మోళ్ళు
పక్షుల కిలకిలారావాలతో నిండిన గూళ్ళు
రంగురంగుల పూలు
రాలితే నేలపై తివాచీలు

Monday, March 20, 2017

చిట్టి కథ – keywords- "అహాన్ని వీడిన రెండు పశ్చాత్తాప హృదయాలు పరస్పరం క్షమాకుసుమాలతో అభిషేకించుకున్నాయి"---అనుమానం- అహంకారం


అనూహ్యా, వెనుక వీధి అనూప్ గారబ్బాయి అభిజిత్ కి హీమోఫీలియా వల్ల అంతః రక్త స్రావం జరిగితే అతని రక్తానికి సరిపడే రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల చుట్టూ వారం రోజులుగా తెగ తిరుగుతున్నవుట?’ అందామె తల్లి.

Sunday, March 19, 2017

దైవస్తుతి & గురుస్తుతి

దైవస్తుతి
1.     తే. గీ.  జల్లెడ పట్టి నేను జీవితం కథగా మలచినాను
                   ఎటుల తెలియు నాకు కవిత్వ మేమనడగ
                   కవిత రాయుమన్ జెప్పిన కరుణ కలిగె
                   లంబ జఠరు నాశీస్సు లభించె భాగ్యాన||

Saturday, March 18, 2017

మర్కట రాజ్యం


1.     మర్కట రాజ్యమంటే రామభక్తుని సామ్రాజ్యమని భ్రమపడకోయ్
అది మన పూర్వజుల వెకిలి చేష్టలకి ఉదాహరణ.

Wednesday, March 15, 2017

ప్రకృతి కాంత




1.     ప్రకృతి కాంత ఆకుపచ్చని చీరతో, అందాల సుగంధాల పూవులతో
మన మననకు తన ప్రేమని మనపై వర్షిస్తుంది.

Monday, March 13, 2017

చిట్టి కథ – Keywords- “మా బాగా చెప్పారు.... ఇక దయచేయండి” title: కూసే మనుషులు


          ఆ రోజు ఆఫీసులో ఒకటే హడావుడి. ఎంత సౌండ్ ప్రూఫ్ గదిలో ఉన్నా ఆ అరుపులు అవినాష్ చెవిని పడ్డాయి. ఆ ప్రభుత్వ ఫ్యాక్టరీలో మానవ వనరుల మేనేజర్ గా పని చేస్తున్నాడు గనుక అతను వెంటనే అప్రమత్తుడై బయటకు నడిచాడు. చూడబోతే, ఓ వంద మంది ఉద్యోగులు, “యాజమాన్యం డౌన్ డౌన్”, అని నినాదాలు చేశారు. అతణ్ణి చూసిన వెంటనే, “పనికిమాలిన హెచ్చార్ మేనేజర్ ఇంటికి వెళ్ళాలి”, అని కూడా అరిచారు.

చిట్టి కథ –keywords – “పక్కపక్కనే దగ్గరగా కూర్చుని ఉన్నా ఆమెకూ అతనికీ మధ్య నిశ్శబ్దపుగోడ నిలబడే ఉంది!"---చిత్తు కాగితం తీర్చిన కష్టం


పెళ్ళైన అయిదేళ్లకు పుట్టిన ఒక్కగానొక్క నలుసు, పదేళ్ళ శరణ్యకి బాగా జబ్బు చేసింది. ఒళ్ళంతా నీలంగా మారుతుంటే, ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తే రక్తనాళాల కాన్సర్ అని డాక్టర్ నిర్ధారించారు. అద్దె ఆటో తోలే అతనికి, నాలుగిళ్ళలో పాచిపని చేసుకునే ఆమెకి, పిల్లని బ్రతికించుకోవడం ఎలాగో అర్థం కాలేదు. 

Sunday, March 5, 2017

చిట్టి కథ- Keywords- అసలు విషయం తెలుసుకున్న అద్వితి కన్నుల్లో గిర్రున కన్నీళ్ళు తిరిగాయి- సర్ప్రైజ్


“ప్రతీసారీ నన్ను గంటల కొద్దీ వెయిట్ చేయిస్తావు నీకిదేం వికృత సంతోషం అద్వితీ?” అన్నాడు అపురూప్. “నీకేం బాబూ, మగ మహారాజువి. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఎవరూ పట్టించుకోరు. నేనేమో ఆడపిల్లని. హాయిగా నా బతుకు నేను బతుకుతుంటే ఈ ప్రేమలో పడేశావ్. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళే నేను అబద్ధం నేర్చుకుంటున్నాను. కారులో వస్తే ఇంట్లో తెలిసిపోతుందని స్పెషల్ క్లాస్లున్నాయని ఇంట్లో చెప్పి, నీ కోసం రెండు బస్సులు మారి వస్తున్నాను. నీకు మంచి ఉద్యోగం వచ్చి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వి అయ్యేదాకా ఇవి భరించలిలే”, అంది అద్వితి.

Wednesday, March 1, 2017

దేశరక్షణకి ఉడుత సాయం




1.     దేశరక్షణ కేవలం సైన్యపు బాధ్యత అనుకోకు
మన దేశ పౌరుడిగా అది నీ బాధ్యత కూడా!