Sunday, March 26, 2017

చిట్టికథ వాక్యం-(keywords) "నేనెవరో మీకు తెలియకపోయినా...మీరెవరో నాకు తెలుసు.మనిద్దరి పరిచయం ఈనాటిది కాదు". ----ఆశ్చర్యం

ఆ ఏరియాకి కొత్తగా వచ్చినట్టు ఆమె బెరుకుతనం చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది. బిక్కమొహం వేసుకుని బిత్తర చూపులతో అటూ ఇటూ చూస్తూ ఎలాగో బస్సు స్టాప్ కి చేరుకుంది. పావుగంటైనా ఇంకా బస్సు రాలేదు.
ఈ లోగా, బైక్ మీద కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తున్న అందగాడొకడు ఆమెను దాటి, మళ్ళీ తిరిగొచ్చి, "నేనెవరో మీకు తెలియకపోయినా...మీరెవరో నాకు తెలుసు.మనిద్దరి పరిచయం ఈనాటిది కాదు", అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో బిత్తరపోయింది. “ఓహ్ ప్లీజ్, మేడం, భయపడకండి. మీరు వెళ్ళే చోట డ్రాప్ చేస్తాను”, అన్నాడు. గౌరవంగా మాట్లాడాడు కదా అని ఆమె బైక్ ఎక్కింది. ఆమె అతనికి ఎలా తెలుసోనన్న ప్రశ్నకి జవాబు లేదు. ఈ హడావుడిలో అతడు నిర్మానుష్యమైన చోటికి మళ్ళాడు. ఆమె ‘హెల్ప్’ అని గట్టిగా అరిచింది గాని అక్కడ జనసంచారం లేదు. అతడు కత్తి తీశాడు. ఒక్క రెప్పపాటు కాలంలో, ఆమె అతడి కత్తి లాక్కుని అతణ్ణి బైక్ మీద నుంచి తోసి, తను అతని మీదకి గెంతింది. ఇప్పుడతను ఆశ్చర్యపోయాడు. “ఏంట్రా, ఆడపిల్లలంటే ఎవడు పడితే వాడి వెంట వచ్చే వాళ్ళలా కనిపిస్తున్నారా? మీ ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించడం చేతకాదురా నీకు? ఆంటీ- రోమియో స్క్వాడ్లు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయిరా....పద...అత్తారింటికి...........మర్యాదలు చేయించుకుని వెళ్దువుగాని”, అని అప్పుడే జీపీఎస్సాయంతో అక్కడికి చేరుకున్న తన అనుచరులకు అతణ్ణి అప్పగించింది
****

No comments: