I grew up on the East Coast of India, so I'm particularly fond of the Sun and the Sea and hence the title which means sea shore in Telugu. If everyone saw the best of photographs, and read only the best writings, where's the opportunity for the alsorans to showcase their talents( or the absence of them)?
Showing posts with label telugu short story. Show all posts
Showing posts with label telugu short story. Show all posts
Friday, June 1, 2018
Thursday, April 12, 2018
చిట్టి కథ - Sentence- "నాను బతికి సెడిన వోన్ని బాబయా...మీరు సెప్పే పాపం పనులు సేస్తూ సెడి బతకలేను...దండాలండీ" (మాండలికంలో)- ఆత్మస్థైర్యం
ఆత్మస్థైర్యం
అదో మోస్తరు పల్లెటూరు.
అందులో పిపీలకం లాంటి వెల్డర్ కాశీ. చేసేవి చిన్నా, చితకా పనులైనా శ్రద్ధగా
చేస్తాడు. ఆ కారణంగా ఊళ్ళో మంచి పేరుంది. “నువ్వు చేసే పని దుబాయ్ లో చేస్తే
లక్షలకు లక్షలు సంపాదించచ్చు”, అని ఓ పెద్ద మనిషి ఉచిత సలహా ఇస్తే, ఉన్న కాస్త
పొలమూ అమ్మేసి, అర్జంటుగా ఓ ఏజెంటు దగ్గరికి వెళ్ళాడు. పూర్వాపరాలు వాకబు చేయని
పాపానికి వాడు కాశీని నిలువునా ముంచాడు.
Friday, March 30, 2018
చిట్టి కథ - Sentence- " తప్పు అయిందని ఒప్పుకున్న తర్వాత కూడా చెప్పుతో కొట్టి మాట్లాడినట్టు బాధించడం గొప్ప సంస్కారమా...చెప్పండి "--అదిగో పులి, ఇదిగో తోక
అదిగో పులి, ఇదిగో తోక
అది 1979వ సంవత్సరం. స్కైల్యాబ్ అనే ఒక ఉపగ్రహం
కూలిపోతోందని రేడియోలో ఒకటే హోరు. ‘అదిగో పులి, ఇదిగో తోక' అన్న రీతిలో ఆ వూళ్ళో
పడుతుంది, ఈ రాష్ట్రంలో పడుతుంది- అని ఒకటే పుకార్లు. ఏది నిజమో, ఏది అబద్ధమో
తెలియని తికమకలో అంతా ఉన్నారు. కొందరు ఢిల్లీలో పడుతుందన్నారు, మరి కొందరు
మద్రాసులో.... ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు....
Wednesday, March 28, 2018
చిట్టి కథ- context- ఆదర్శం
Given Story:
ఆత్మీయ మిత్రుడు అరవింద్
ఇంటికి వచ్చి శుభలేఖ ఇస్తూ "మీరు
కుటుంబ సమేతంగా పెళ్ళికి రావాలి...వీలుచేసుకుని ఓ మూడురోజుల ముందు", అని
ఆహ్వానించగానే ఉబ్బితబ్బిబ్బయ్యాడు రాజేష్. మిత్రుడు
ఉండేది ప్రక్క ఊరిలోనే. రెండు గంటల ప్రయాణం. బయల్దేరిన మిత్రుడు అరవింద్ కి
వీడ్కోలు చెప్పి ఇంట్లోకి వచ్చి శుభలేఖ విప్పి పెద్ద అక్షరాలతో ముద్రించిన
వాక్యాన్ని చదివి గతుక్కుమన్నాడు.... "బహుమతులు
స్వీకరింపబడవు".
Friday, March 16, 2018
చిట్టి కథ- keywords-"విళంబి, ప్రకృతి , మామిడి, కవి సమ్మేళనం , ఉగాది, అక్కా బావ, కొత్త జంట, పచ్చడి , వంటకాలు, తోరణాలు, కొత్త బట్టలు , మిఠాయిలు "
పండుగ- సంస్కృతి- సంస్కారం
“సుందరం, మీ అల్లుడు చాలా
బుద్ధిమంతుడయ్యా! అమెరికాలో పెరిగిన అబ్బాయైనా, ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడో! అందరినీ
తెలుగులో, ‘విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు’, అని పలుకరిస్తూంటే, నా
చిన్నతనం గుర్తు వచ్చిందంటే నమ్ము! చిలుకా- గోరింకల్లా కొత్త జంట భలే
ముచ్చటొస్తోందోయ్,” మెచ్చుకోలుగా అన్నాడు పరంధామం. “నిజమే బాబాయి గారూ! ఈ అమెరికా
వాళ్ళు ఓ పెళ్ళిలో చూసి, మా అమ్మాయిని చేసుకుంటామని ఊదరగొట్టేస్తే నేను, ఉమా కూడా
అలాగే భయపడ్డామనుకోండి! కానీ మా బంధువులబ్బాయి ఒకడీమధ్యే వీళ్ళ ఊరెళ్ళాడు చదువు
కోసం. వాణ్ణి వీళ్ళ గురించి విచారించామన్నాం. వాడు వెంటనే, వాళ్ళ గురించి ఓ
పురాణమే చెప్పాడు. వాళ్ళు ప్రతి పండుగనూ సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారట. ఊళ్ళో
ఉండే తెలుగు వాళ్ళని, ఇతర భారతీయులని పిలిచి సాంప్రదాయ వంటకాలతో విందు
చేసి, సంస్కృతిపరంగా జరిగే కార్యక్రమాలని కుదిరిన మేరకి నిర్వహిస్తారట. అందుకే
ఒప్పుకున్నాం. గొప్ప చెప్పుకుంటే బాగుండదు, మా అల్లుడు మా కోసం కొత్త బట్టలు
తెచ్చాడండీ”, అని ముగించాడు సుందరం.
Saturday, March 10, 2018
చిట్టి కథ- keywords- "వదులుకున్న వారిని కలుపుకోవచ్చు...విదిలించి వదిలించుకున్న వారి దరి చేరాలంటే మనసు అంగీకరించాలి"- ‘వృద్ధ పురుషా’
‘వృద్ధ పురుషా’
“మహేష్ ని ఇవ్వాళ చూశాను. ఆరోగ్యంగానే
ఉన్నాడు. నీ గురించి అడిగాడు. నిన్ను వదిలి వెళ్ళినందుకు, పాపం, బాధ పడ్డాడు.
నువ్వొప్పుకుంటే నీతో జీవితం పునఃప్రారంభం చేద్దామనుకుంటున్నాడు”, అని ముగించింది
అశ్వని. ప్రేమ మాత్రం తొణక లేదు. “ఊహూఁ”, అని ముక్తసరిగా జవాబిచ్చింది. తన మదిలో
అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి, గతం గుర్తుకొచ్చి.
Friday, March 9, 2018
చిట్టి కథ- context- సెంటిమెంట్
Given context:
వాళ్ళు రక్త సంబంధీకులే
కానీ మాట తేడా వచ్చి పౌరుషాలు పెరిగి బంధాలు క్షీణింపజేసుకుని ఒకరి రక్తం మరొకరు
కళ్ళ చూస్తామనుకునే స్థాయికి చేరుకున్నారు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి పడితే చటుక్కున
మండి పోతోంది. ఒకరోజు ఉదయాన్నే పొడవాటి కర్రతో ఇంటి వైపు దూసుకువస్తోన్న తమ్ముడిని
చూసి అన్న ఇంట్లో వాళ్ళు ఆందోళనకు గురయ్యారు....
Saturday, March 3, 2018
చిట్టి కథ- context- లేని పెద్దరికం
Given context:
ఆమె ముతక చీరలో నడివయస్సులో పాత ముఖంతో కనిపిస్తున్నా పరిశుభ్రంగా ఉంది.ఖరీదైన వివాహ ప్రాంగణంలో ఆధునిక వాసనల మధ్య ఆమెని ప్రతి ఒక్కరూ గమనించినా తమ తమ హొయల ఒలకపోతలో నిమగ్నమై ఉన్నారు. ఎండాకాలం కావడంతో బయటంతా ఉక్కపోత. చివరగా కూర్చున్న ఆమె కళ్యాణ మండపం వైపు చూస్తూ నిశ్శబ్దంగా కన్నీటిని వర్షిస్తోంది...
Saturday, February 17, 2018
చిట్టి కథ- keywords- "కలలు కన్న దేశంలోకి అడుగుపెట్టాక.... కన్న దేశం కలలలోకి వస్తోందిరా"- మాట రాని మౌనమిది
మాట రాని మౌనమిది
ఆనందరావు డ్యూటీ ముగించి, ఇంటికి వచ్చి, కాస్సేపు టీవీ చూసి, ఎప్పటిలాగే
చపాతీపిండి కలిపి, వాటిని వత్తసాగాడు. ఈ మాటు చుక్కా రొట్టె చేసుకుందామనుకుని, రొట్టెని
నిప్పు మీద కాలుస్తున్నప్పుడు చెయ్యి కాల్చుకున్నాడు. ఆ మంట తన గుండెల్లో
రగులుతున్న చిచ్చుని బయటపడేలా చేసింది. అమాంతం గతంలోకి వెళ్ళాడు.
Thursday, February 15, 2018
చిట్టి కథ - Sentence- "ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది...."- ప్రేమించేది ఎవరిని?
ప్రేమించేది ఎవరిని?
“సారీ సార్, ఈ మాటు కూడా మీ ఆవిడకు గర్భం
కలగలేదు. మీకు ముందే చెప్పాను, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భాన్ని ధరించడం కష్టమని.
మీరు మూడు సార్లు ప్రయత్నించారు, దేవుడు దయ తలచలేదు”, అంది డా|| సుమన సాగర్ తో.
“నేను ముందు ప్రేమించేది కృష్ణవేణిని. ఆమె కన్న బిడ్డ నాకు ప్రయారిటీ కానేకాదు”,
అన్నాడు సాగర్ తొణక్కుండా. “మరో విషయం. ఆవిడకి గర్భసంచీ నిండా ఫైబ్రాయిడ్స్
ఉన్నాయి. ప్రస్తుతానికి మేనేజ్ చేయవచ్చు. భవిష్యత్తులో ఎలా అవుతుందోనన్న భయంతో హిస్టరెక్టమీ,
అంటే గర్భాసంచీని తీసేస్తే నయం. అప్పుడు ఆవిడ తల్లి అయ్యే అదృష్టాన్ని జీవితాంతం కోల్పోతారు”,
చల్లగా చెప్పింది డా|| సుమన. ఆ మాట విన్న వెంటనే సాగర్ మొహం చిన్నబోయింది.
Thursday, February 1, 2018
చిట్టి కథ - Sentence- ఆమె ఆవేశంగా మాట్లాడుతుంటే అతను తలదించుకుని నిశ్శబ్దంగా వింటున్నాడు...చుట్టూ గుమిగూడిన జనం సాక్షిగా...- తల దించుకోక ఏం చేస్తాడు?
తల దించుకోక ఏం చేస్తాడు?
ఆమె పేరు భ్రమరాంబ.
ఆ రోజే రైల్వేలో ఆర్పీఎఫ్ కాన్స్టేబుల్ గా చేరింది. స్టేషన్ లో ఉద్యోగం. చేతిలో
లాఠీ పట్టుకుని అటూ-ఇటూ కలయజూస్తూ తిరుగుతూంటే భలే త్రిల్ ఫీల్ అయింది. అవదు మరి? వాళ్ళ
ఊరు నుండి ఒక పోటీ పరీక్షలో ఎక్కువ మార్కులతో పాస్ అయిన మొట్టమొదటి మహిళ ఆమె.
Thursday, January 18, 2018
చిట్టి కథకి ముగింపు- పుస్తకాలు నిలిపిన పసుపుకుంకాలు
Given Story:
ఇంట్లోకి అడుగుపెట్టిన త్రిమూర్తికి అంతా
బోసిపోయినట్టనిపించింది. దరహాసంతో వచ్చిన కొడుకు
"డాడీ నీకో సర్ ప్రైజ్... ఇంట్లో సంవత్సరాలుగా
మూలుగుతున్న వాటిని తీసి పాతసరకు కొనేవాడికి ఇచ్చేసాను.మంచి రేటు వచ్చింది.ఆ
డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొన్నాను.నెలకు రెండొందల నెట్ ఆఫర్తో ప్రపంచాన్ని చూడవచ్చు",
అన్నాడు. త్రిమూర్తి కళ్ళు తిరిగినట్టయింది. ఐదువేల పుస్తకాల విలువైన ఇంటి
గ్రంథాలయం కనిపించకపోవడంతో స్పృహ తప్పి పడిపోయాడు ...
My Conclusion:
పుస్తకాలు నిలిపిన పసుపుకుంకాలు
ఆసుపత్రిలో త్రిమూర్తి ‘నా
పుస్తకాలు... నా పుస్తకాలు’, అని మధ్య మధ్య అరవసాగాడు. చుట్టాలింట్లో పెళ్ళినుంచి
తిరిగొచ్చిన భార్య, మణి, చెంగంచుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటోంది. ఈలోగా డాక్టర్
వచ్చి, “ఆయన మనసుకి గాయం తగిలింది. వెంటనే, ఆయన పోగొట్టుకున్న పుస్తకాలు కొనండి.
కొనలేకపోతే, కనీసం లైబ్రరీ నుంచైనా తెప్పించండి”, అన్నారు.
Thursday, January 11, 2018
చిట్టి కథ - Sentence- "చేతిని విదిలించి కోపంగా కదిలిపోతుంటే, దూరమవుతున్న ఆత్మీయతను చూసి గుండె భారమైంది"
తండ్రి మనసులోని ఆవేదన
“సిచ్యుయేషన్ ఇది: హీరోయిన్,
అంటే మీ కూతురు, చిన్న ఉద్యోగం చేసే వాణ్ణి ప్రేమిస్తుంది. వాడు మీ ఆస్తులకి ఆశపడి
మీ అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడని మీరు అనుకుంటారు. మీరు పెళ్ళికి ఒప్పుకోలేదు
కాబట్టి ఆ అబ్బాయి మీ ఇంటికొచ్చి మీ అమ్మాయిని ఎవరు కావాలో తేల్చుకో మంటాడు. ఆమె
వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు తీయబోయే షాట్ లో ఈ వాక్యానికి అభినయం చేయాలి: ‘చేతిని విదిలించి కోపంగా కదిలిపోతుంటే, దూరమవుతున్న ఆత్మీయతను చూసి
గుండె భారమైంది’. ఇది తండ్రి మనసులోని ఆవేదనని అవిష్కరించేలా ఆక్ట్ చేయాలి”, అని
వివరించాడు అసిస్టెంట్ డైరెక్టర్. చిన్న చిన్న వేషాలు వేసే వీరబాబు దీనికి ముందు షాట్
గుర్తు చేసుకున్నాడు: వీరబాబు హీరోయిన్ చెయ్యి పట్టుకుని, “ఇన్నేళ్ళ ప్రేమని
కాదనుకుని నిన్నగాక మొన్న నీ జీవితంలోకొచ్చి, నిన్ను మాయ మాటలతో భ్రమపెట్టే వీడు
ఎక్కువైపోయాడా?” అని ఆర్ద్రతతో అన్నాడు, కోపంతో కాదు.
Thursday, January 4, 2018
చిట్టికథ- 2 Sentences- నిజమైన దేశభక్తుడు
చిట్టికథకై వాక్యాలు :
“వెళ్ళాల్సిందేనంటారా?"
అడిగిందామె సజల నయనాలతో. "ఒప్పుకున్నాక
తప్పదు కదా!"
అన్నాడతను తన చేతిలో చేయిని మరోసారి గట్టిగా నొక్కుతూ విడివడే పొడి
దరహాసంతో...
నిజమైన దేశభక్తుడు
కర్తార్ సింగ్ కి తన ఊరు వెళ్ళేటప్పుడు
ఆనందమే ఆనందం. తల్లి దండ్రులతో నెల రోజులు గడుపబోతున్నందుకు; అంతే కాదు ఈ మాటు అతనికి
సిమ్రన్ అనే అందాలరాశితో పెళ్ళి కాబోతోంది కూడా! పైకి గుంభనంగా కనిపించే అతను ఆమె
ఫోటో ని తన మొబైల్లోనూ, తన మనసులోనూ భద్రంగా దాచుకున్నాడు.
Wednesday, January 3, 2018
చిట్టి కథ- keywords- " నా ప్రయత్నం నచ్చకపోతే ప్రోత్సహించకండి...అంతే కానీ వ్యంగ్య విమర్శలతో బాధపెట్టకండి " - మోడరన్ వేటూరి
మోడరన్ వేటూరి
పద్మాసన ఈ మధ్యనే రాతకోతలు
మొదలెట్టింది. ఆత్మవిశ్వాసం ఇంకా కుదరక స్నేహితుడు శివని అభిప్రాయమడిగింది. ఆమె
వ్రాసిన మొదటి నాలుగు కవితలు చదవడానికి వారం రోజులకి పైగా తీసుకుని, “భేష్ పద్మా,
మోడరన్ వేటూరివౌతావు”, అని కాగితాలు తిరిగిచ్చేశాడు. వేటూరి అంటే భక్త కన్నప్ప, శంకరాభరణం,
సిరిసిరిమువ్వ, లాంటి సినిమాల్లో పాటలు వ్రాసి, అవార్డులు గైకొన్న మహానుభావుడని ఆమెకు
తెలుసు. అందుకే, వేటూరి పేరు వినగానే ఎగిరి గంతేసినంత పని చేసి, ఆ రోజు నుండీ
అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకీ కవితలు వినిపించడం మొదలుపెట్టింది.
Tuesday, January 2, 2018
చిట్టి కథ- keywords- "ఆ ఖర్చంతా నేనే భరిస్తాను... ముందు పని కానివ్వండి " అందామె చేతి బంగారు గాజులు తీసి అందిస్తూ-టూకీగా
“రాజా- రాణి సంపన్నులైన ఆదర్శ దంపతులు.
వాళ్ళకుండే ఒకే ఒక కొరత పిల్లలు లేకపోవడం. రాజా ఎవరైనా దత్తత తీసుకుందామంటాడు;
రాణి ఒప్పుకోదు, ‘మీకుండే విలువల విలువ వాళ్ళకి తెలియకపోవచ్చ’ని. లక్ష్మి అనే
అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తుంది. రెండవ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోయినా, తను ఎంతగానో
ప్రేమించే భార్య కోరిన కోరిక కోసం ఒప్పుకుంటాడు రాజా. లక్ష్మికి సవతంటే ఇష్టంలేక రాణిని ఇంట్లోంచి వెళ్ళగొట్టిస్తుంది.
కట్ చేస్తే ముసలి వయసులో ఉన్న రాణి ఒక అనాథని చేరదీసి అతని పంచన ఉంటుంది. ఒక రోజు ఆమె
తాయిలాలమ్మి వస్తుంటే ఒక ఆక్సిడెంట్ ని చూస్తుంది. ఒక బెంజ్ కార్ కింద చిరుగు
పాతల్లో ఉన్న ఒక ముసలామె పడిందని తెలుసుకుంటుంది.
Friday, December 15, 2017
చిట్టి కథకి ముగింపు- కుప్పతొట్టి తెచ్చిన పంట!
Given Story:
(ఉదయం) అర్థరాత్రి పన్నెండు గంటలు. పరిశుభ్ర
కార్మికురాలు సూరమ్మ పై ఆగంతకుల దాడి.తీవ్ర గాయాలు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ
సూరమ్మ. కారణం ఏమై ఉంటుంది? మహానగరంలో రాత్రి పన్నెండింటి నుండి ఉదయం ఆరు వరకూ నగర పరిశుభ్ర కార్యక్రమంలో
నిమగ్నమయ్యే కాంట్రాక్టు ఉద్యోగినిపై కక్ష కట్టి అంతమొందించే ప్రయత్నం నగర ప్రజలకు
ఆశ్చర్యం కలిగించింది ....
My Conclusion:
కుప్పతొట్టి తెచ్చిన పంట!
రెండు రోజుల తరువాత.....
Thursday, December 7, 2017
చిట్టి కథ- keywords- "మన దారులు వేరైనా గమ్యం ఒక్కటే... కలుసుకుందాం తప్పకుండా ఒకరోజు విజయ దరహాసంతో"- విజయ దరహాసమంటే?
విజయ దరహాసమంటే?
ఆ రోజు ఎంసెట్ పరీక్ష.
పిల్లల కోసం దణ్ణం పెట్టుకోవడానికి గుడికి వచ్చారు. మహేష్ తల్లి, “మా వాడికి సీట్
ఇప్పిస్తే దేవుడికి బంగారు తొడుగు చేయిస్తానని మొక్కుకున్నాను. మరి మీరేం
మొక్కుకున్నారు?” అని సురేష్ తల్లిని అడిగింది. “అత్యుత్తమమైన పిల్లలకి
ఉత్తీర్ణతనివ్వమని”, అని ముక్తసరిగా జవాబిచ్చి సెలవు తీసుకుంది సురేష్ తల్లి.
ఫలితాల రోజున సురేష్ కి వెయ్యి చిల్లర రాంక్ వస్తే, మహేష్ కి పిన్ కోడ్ లాంటి రాంక్
వచ్చింది. ఎక్కడో మారు మూల కాలేజీలో కంప్యూటర్ చదివే బదులు ఉన్న ఊళ్ళో ఎలక్ట్రానిక్స్
చదివితే మంచిదనుకుని సురేష్ అలాగే చేశాడు. మహేష్ ని మాత్రం బోలెడు కట్నం (అదే...డొనేషన్)
ఇచ్చి, ఎక్కడో కర్ణాటకలో సివిల్ ఇంజనీరింగ్ చదివించారు. చదువుకి
బయలుదేరబోతున్న మహేష్ ని కలిశాడు సురేష్. సందేశాన్నిస్తున్న వాడిలా, "మన దారులు వేరైనా గమ్యం ఒక్కటే...
కలుసుకుందాం తప్పకుండా ఒకరోజు విజయ దరహాసంతో," అని బయలుదేరాడు మహేష్.
దేవుడికి బంగారు తొడుగు ఏర్పాటయ్యింది.
Wednesday, November 29, 2017
చిట్టి కథకు ముగింపు- అదే నా భయం కూడా!
Given Story:
" బావా...డాక్టర్ గారి దగ్గర్నుండి ఫోన్ వచ్చింది...రేపట్నుండి మూడు రోజులు
"మెగా నేత్ర శిబిరం"...ఆపరేషన్ కి సిద్ధం కమ్మన్నారు...నాకు చూపు
వస్తుందట "
" అలాగా "
" ఎప్పుడు వెళ్దామంటావ్
"
" నీ ఇష్టం..."
" అదేమిటి బావా...ఇంత
మంచి వార్త చెబితే ఆనందంతో నన్ను ముద్దులతో ముంచెత్తుతావనుకున్నాను... అంత పొడి
పొడి మాటలతో... నీకు ఇష్టం లేదా "
" అలా అని నేను అనలేదే
"
Thursday, November 23, 2017
చిట్టికథకి ముగింపు- గతం వెక్కిరిస్తే....
Given Story:
ఐదేళ్ళ సుదీర్ఘ యుద్ధ పోరాట అనంతరం జయరాం కు
విజయం వరించింది. డిఎస్సీలో క్వాలిఫై అయ్యాడు. టీచర్ ఉద్యోగం ఖాయం. ఆనందంతో తల్లీతండ్రీ
కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు. పోస్టింగ్ ఆర్డరు అందుకుని నీరుగారి పోయాడు జయరాం. "ఉద్యోగం వదులు
కోవాలేమో". " ఏం "
అడిగారు తండ్రి. " అతి కష్టం మీద
ఉద్యోగం వస్తే వదులుకుంటావా " ఆశ్చర్యంగా అంది తల్లి. "
అలమండ లో ఇద్దరు
టీచర్ల స్కూల్లో పోస్టింగమ్మా" " అయితే ..."
"
అక్కడ హెడ్
మాష్టారు రాంబాబు అమ్మా "....
My Conclusion:
“ఎవరూ, మీ సీనియర్ రాంబాబేనా?” అడిగింది తల్లి. “అవును, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు,
వీడెక్కడ దాపురించాడమ్మా!” బాధపడ్డాడు జయరాం. “అయితే మంచిదే! వాడైతే తెలిసిన వాడు గనుక
మేం నిశ్చింతగా ఉండచ్చు. నువ్వేంట్రా శనీశ్వరం లాంటి పాడు మాటలంటున్నావ్ వాణ్ణి?”
తల్లి వారించబోయింది. “నా డీ యస్సీ ఐదేళ్ళు అవడానికి కారణం వాడేనమ్మా!” అన్నాడు
జయరాం బాధగా.
Subscribe to:
Posts (Atom)