మోడరన్ వేటూరి
పద్మాసన ఈ మధ్యనే రాతకోతలు
మొదలెట్టింది. ఆత్మవిశ్వాసం ఇంకా కుదరక స్నేహితుడు శివని అభిప్రాయమడిగింది. ఆమె
వ్రాసిన మొదటి నాలుగు కవితలు చదవడానికి వారం రోజులకి పైగా తీసుకుని, “భేష్ పద్మా,
మోడరన్ వేటూరివౌతావు”, అని కాగితాలు తిరిగిచ్చేశాడు. వేటూరి అంటే భక్త కన్నప్ప, శంకరాభరణం,
సిరిసిరిమువ్వ, లాంటి సినిమాల్లో పాటలు వ్రాసి, అవార్డులు గైకొన్న మహానుభావుడని ఆమెకు
తెలుసు. అందుకే, వేటూరి పేరు వినగానే ఎగిరి గంతేసినంత పని చేసి, ఆ రోజు నుండీ
అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకీ కవితలు వినిపించడం మొదలుపెట్టింది.