Wednesday, September 20, 2017

మేమే...


మేమే...
౧. సీతాకోకలని మురిసిపోవద్దు
అవి జీవంలేని యాంత్రిక వెలుగులు

౨. మా గొప్ప మేమే చెప్పుకుంటాం
చెట్లను పెంచం, ఉన్నవి కొట్టి ఇళ్ళు కట్టేస్తాం
కానీ పర్యావరణ రక్షణకి పూనుకుంటాం
కృత్రిమ సీతాకోకలని తాయారు చేస్తాం.
౩. చేసిన పాపాలకి వేడి పెరిగిపోతే
చల్లటి గదుల్లో దాక్కుంటాం
పొద్దుగుంకాక అడుకోవదనికి ఈ సీతాకోకచిలుకలని వాడుకుంటాం.
౪. సీతాకోకచిలుక పుట్టుకతోనే ఇంతందంగా ఉండదు కదా!
ఈ విషయాన్ని దర్జాగా మరచిపోతాం
సిమెంటు అరణ్యాలని సృష్టిస్తాం
తీరిక సమయాల్లో ‘పర్యావరణ రక్షణ’ గురించి నినాదాలు లేవదీస్తాం!
౬. మేమే మనుషులం......మంచిని మరచిన వారం
కృత్రిమత్వంలో ఈ సీతాకోక చిలుకలతో పోటీ పడతాం!

*****

No comments: