Showing posts with label Ending to a short story. Show all posts
Showing posts with label Ending to a short story. Show all posts

Friday, December 15, 2017

చిట్టి కథకి ముగింపు- కుప్పతొట్టి తెచ్చిన పంట!

Given Story:
(ఉదయం) అర్థరాత్రి పన్నెండు గంటలు. పరిశుభ్ర కార్మికురాలు సూరమ్మ పై ఆగంతకుల దాడి.తీవ్ర గాయాలు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ సూరమ్మ. కారణం ఏమై ఉంటుంది? మహానగరంలో రాత్రి పన్నెండింటి నుండి ఉదయం ఆరు వరకూ నగర పరిశుభ్ర కార్యక్రమంలో నిమగ్నమయ్యే కాంట్రాక్టు ఉద్యోగినిపై కక్ష కట్టి అంతమొందించే ప్రయత్నం నగర ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది ....
My Conclusion: 
కుప్పతొట్టి తెచ్చిన పంట!
        రెండు రోజుల తరువాత.....

Wednesday, November 29, 2017

చిట్టి కథకు ముగింపు- అదే నా భయం కూడా!

Given Story: 
" బావా...డాక్టర్ గారి దగ్గర్నుండి ఫోన్ వచ్చింది...రేపట్నుండి మూడు రోజులు "మెగా నేత్ర శిబిరం"...ఆపరేషన్ కి సిద్ధం కమ్మన్నారు...నాకు చూపు వస్తుందట "
" అలాగా "
" ఎప్పుడు వెళ్దామంటావ్ "
" నీ ఇష్టం..."
" అదేమిటి బావా...ఇంత మంచి వార్త చెబితే ఆనందంతో నన్ను ముద్దులతో ముంచెత్తుతావనుకున్నాను... అంత పొడి పొడి మాటలతో... నీకు ఇష్టం లేదా "
" అలా అని నేను అనలేదే "

Thursday, November 23, 2017

చిట్టికథకి ముగింపు- గతం వెక్కిరిస్తే....

Given Story:
ఐదేళ్ళ సుదీర్ఘ యుద్ధ పోరాట అనంతరం జయరాం కు విజయం వరించింది. డిఎస్సీలో క్వాలిఫై అయ్యాడు. టీచర్ ఉద్యోగం ఖాయం. ఆనందంతో తల్లీతండ్రీ కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు. పోస్టింగ్ ఆర్డరు అందుకుని నీరుగారి పోయాడు జయరాం. "ఉద్యోగం వదులు కోవాలేమో". " ఏం " అడిగారు తండ్రి. " అతి కష్టం మీద ఉద్యోగం వస్తే వదులుకుంటావా " ఆశ్చర్యంగా అంది తల్లి. " అలమండ లో ఇద్దరు టీచర్ల స్కూల్లో పోస్టింగమ్మా" " అయితే ..." " అక్కడ హెడ్ మాష్టారు రాంబాబు అమ్మా "....
My Conclusion:
“ఎవరూ, మీ సీనియర్ రాంబాబేనా?” అడిగింది తల్లి. “అవును, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు, వీడెక్కడ దాపురించాడమ్మా!” బాధపడ్డాడు జయరాం. “అయితే మంచిదే! వాడైతే తెలిసిన వాడు గనుక మేం నిశ్చింతగా ఉండచ్చు. నువ్వేంట్రా శనీశ్వరం లాంటి పాడు మాటలంటున్నావ్ వాణ్ణి?” తల్లి వారించబోయింది. “నా డీ యస్సీ ఐదేళ్ళు అవడానికి కారణం వాడేనమ్మా!” అన్నాడు జయరాం బాధగా.

Thursday, November 16, 2017

చిట్టి కథకు ముగింపు- ఇప్పుడే తెలిసింది

Given Story:

అతడు ఇంట్లోకి దూరి అనిల్ జుత్తు పట్టుకుని రెండు చెంపలూ వాయిస్తున్నాడు.... అనిల్ తండ్రి రెండు చేతులూ వాల్చి కలుపుకుని తలదించుకున్నాడు. అనిల్ తల్లి భారతి వంటగదిలో మొహం సగం చీరకొంగుతో కప్పుకొని కన్నీరు కారుస్తూ తొంగి చూస్తోంది....
My conclusion:
ఇప్పుడే తెలిసింది
అతడు మరెవరో కాదు అనిల్ వాళ్ళ తెలుగు మాష్టారు. బాగా చదువుకున్న వాడు. ఈ రోజుల్లో అందరూ మాతృభాషని మరచిపోతున్నారని ఇంజనీరింగ్ చదివాక ఎం.ఏ తెలుగు చదివి, ఆ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరాడు. నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి ఉండే రకం.

Monday, November 13, 2017

చిట్టి కథకి ముగింపు- నైతిక బాధ్యత

Given Story:
ఫ్లైట్ దిగిన వినయ్ భారత నేలని నమస్కరించాడు.ఒక్కసారిగా ఒళ్ళు పులకరించింది. కుటుంబంతో కంటకాపల్లి పయనమయ్యాడు. నూట ఎనభై కిలోమీటర్లు. ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఉక్కరిబిక్కిరి చేస్తూ గోలగోలగా జనుల ఘన స్వాగతం. విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించిన వినయ్ పల్లెటూళ్ళో స్థిరపడబోతున్నారన్న వార్త తెలిసి ఆశ్చర్యపోతూ ఆసక్తిగా అడిగాడు శుభోదయ విలేకరి.. " అనాధగా ఈ ఊళ్ళో చిన్నప్పుడు తిరుగాడే వాణ్ణి... ఈ ఊరి ప్రజలు నన్ను అక్కున చేర్చుకుని వంతుల వారిగా వారాలబ్బాయిగా అంతులేని ప్రేమ అందించారు.చద్దన్నం పెట్టారు.పప్పు ముద్దన్నం పెట్టారు. చదువుపై నా ఆసక్తి గమనించి చందాలతో బలీయ బంధాన్ని ఏర్పరిచారు.ఇష్టపడి కష్టపడి చదువుకున్న నాకు విదేశాల్లో ఉన్నత పదవులు స్వాగతించాయి. ధనం కీర్తి లభించింది. సంతృప్తి చెందాను. ఇప్పుడు నా వంతుగా పల్లె తల్లి సేవ చేసి రుణం తీర్చుకోవాలని..."
My Conclusion:

నైతిక బాధ్యత
        “అంటే మనం ఇక్కడే ఉండిపోతున్నమా వినయ్?”, గద్దించింది అతని భార్య కుసుమ. “అన్నాను కదా, మాతృ ఋణం తీర్చుకోవాలంటారు, నా తల్లెవరో తెలియదు కనుక కంటకాపల్లి  ఋణం తీర్చుకోవాలని!” అన్నాడు వినయ్, మధ్యాహ్నం ఒక కునుకు తీసే యత్నంలో. “డబ్బిస్తావనుకున్నాను గాని మకాం మార్చేస్తానని నాతో మాట వరుసకైనా అనలేదేం?”అంది కుసుమ. మనిద్దరివీ ఒకేలాంటి ఆలోచనలు గనుక నీకూ ఇష్టముందనుకున్నాను”, అన్నాడు వినయ్.

Thursday, October 19, 2017

చిట్టి కథకి ముగుంపు మీదే - చూసినవన్నీ..

Given Story:
" నానింక సెయ్యలేను బావూ "
" అలా అంటే ఎలా చిట్టెమ్మా"
" మీరు పుట్టినప్పట్నుండీ మీ ఇంట్లో పని సేత్తన్నాను కదా. .
ఇక నాకు ఓపిక నేదు... నాకు
సెలవిప్పించండి "
" అది కాదు చిట్టెమ్మా... నీ అంత నమ్మకస్థులు మాకు ఎక్కడ దొరకుతారు ?"
" ఏం నమ్మకాలో ఏమో...మనుసులు పెద్దయితే మనసులు పెద్దవ్వాలి కద బాబూ "

Friday, October 13, 2017

"ఈ చిట్టికథకు ముగింపు మీదే! '- అసలు కారణం?

Given Story: 
ఊడిన పంచె మెడచుట్టూ వేసుకుని వదులైన నిక్కరులాంటి పంట్లాంతో ఓ బొజ్జాయన వగరుస్తూ...పరుగో పరుగు! అతడిని వెంబడిస్తూ కాలనీలో ఓ గుంపు...బొజ్జాయన ఏ సందులో దూరినా వెంబడించే గుంపులో జనం పెరుగుతునే ఉన్నారు...కొందరి చేతిలో పొడుగాటి కర్రలు...మరికొందరి చేతిలో రాళ్ళూ...చోద్యం చూస్తూ కిటికీల్లోనుండి భార్యామణులు...

Monday, October 9, 2017

" ఈ చిట్టికథకు ముగింపు మీదే " - ఆశ్రమం


Given Story:
కారు శరవేగంగా పరుగెడుతోంది. తండ్రీ కొడుకులిద్దరి మధ్య నిశ్శబ్దం...
డ్రైవింగ్ సీట్లో కొడుకు.
" ఒకసారి కారు ఆపు బాబూ "
" ఎందుకు "