Showing posts with label book lover. Show all posts
Showing posts with label book lover. Show all posts

Thursday, January 18, 2018

చిట్టి కథకి ముగింపు- పుస్తకాలు నిలిపిన పసుపుకుంకాలు


Given Story: 
ఇంట్లోకి అడుగుపెట్టిన త్రిమూర్తికి అంతా బోసిపోయినట్టనిపించింది. దరహాసంతో వచ్చిన కొడుకు
"డాడీ నీకో సర్ ప్రైజ్... ఇంట్లో సంవత్సరాలుగా మూలుగుతున్న వాటిని తీసి పాతసరకు కొనేవాడికి ఇచ్చేసాను.మంచి రేటు వచ్చింది.ఆ డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొన్నాను.నెలకు రెండొందల నెట్ ఆఫర్తో ప్రపంచాన్ని చూడవచ్చు", అన్నాడు. త్రిమూర్తి కళ్ళు తిరిగినట్టయింది. ఐదువేల పుస్తకాల విలువైన ఇంటి గ్రంథాలయం కనిపించకపోవడంతో స్పృహ తప్పి పడిపోయాడు ...

My Conclusion:

పుస్తకాలు నిలిపిన పసుపుకుంకాలు

             ఆసుపత్రిలో త్రిమూర్తి ‘నా పుస్తకాలు... నా పుస్తకాలు’, అని మధ్య మధ్య అరవసాగాడు. చుట్టాలింట్లో పెళ్ళినుంచి తిరిగొచ్చిన భార్య, మణి, చెంగంచుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటోంది. ఈలోగా డాక్టర్ వచ్చి, “ఆయన మనసుకి గాయం తగిలింది. వెంటనే, ఆయన పోగొట్టుకున్న పుస్తకాలు కొనండి. కొనలేకపోతే, కనీసం లైబ్రరీ నుంచైనా తెప్పించండి”, అన్నారు.