Thursday, January 4, 2018

చిట్టికథ- 2 Sentences- నిజమైన దేశభక్తుడు

 చిట్టికథకై వాక్యాలు :
 “వెళ్ళాల్సిందేనంటారా?" అడిగిందామె సజల నయనాలతో. "ఒప్పుకున్నాక తప్పదు కదా!"
అన్నాడతను తన చేతిలో చేయిని మరోసారి గట్టిగా నొక్కుతూ విడివడే పొడి దరహాసంతో...

నిజమైన దేశభక్తుడు
          కర్తార్ సింగ్ కి తన ఊరు వెళ్ళేటప్పుడు ఆనందమే ఆనందం. తల్లి దండ్రులతో నెల రోజులు గడుపబోతున్నందుకు; అంతే కాదు ఈ మాటు అతనికి సిమ్రన్ అనే అందాలరాశితో పెళ్ళి కాబోతోంది కూడా! పైకి గుంభనంగా కనిపించే అతను ఆమె ఫోటో ని తన మొబైల్లోనూ, తన మనసులోనూ భద్రంగా దాచుకున్నాడు.

          పెళ్ళి తతంగం పూర్తయ్యేసరికి రాత్రి మూడు గంటలైంది. మరుసటి రోజు మధ్యాహ్నం బంధుమిత్రులతో విందు భోజనమారగిస్తూంటే భారత సైన్యపు హెడ్ క్వార్టర్ నుండి వెంటనే బయల్దేరమని పిలుపొచ్చింది. పెళ్ళయిన కొన్ని గంటలలోనే భర్త ప్రయాణం కట్టాల్సి రావడం ఆమెకు బాధను కలిగించింది. "వెళ్ళాల్సిందేనంటారా", అడిగిందామె సజల నయనాలతో. "ఒప్పుకున్నాక తప్పదు కదా", అన్నాడతను తన చేతిలో చేయిని మరోసారి గట్టిగా నొక్కుతూ విడివడే పొడి దరహాసంతో...
          దేశం కోసం కుటుంబాలకి సైతం దూరంగా ఉంటూ సేవ చేసేవాడే నిజమైన దేశభక్తుడని సిమ్రాన్ తననితాను అనునయించుకుంది. అటువంటి దేశభక్తుడి భార్య అయినందుకు గర్వపడింది.

*******

No comments: