1. ఉగాది పండుగ వచ్చిందోయని
కొత్తకి స్వాగతం మాత్రం
పలికితే చాలదు
మనలో ఉండే చెడుని విడిచి
కొత్త జీవితం ఆరంభించాలి.
2. ఉగాది వచ్చిందని
నూతన వస్త్రధారణ చేస్తే
సరిపోదు
మనల్ని నమ్ముకున్న వారికి
వాటిని సమకూర్చాలి.
3. ఉగాది పచ్చడి తినగానే
పనైపోయిందని అనుకోకూడదు
ఏడాది పొడుగునా ఉండే
ఆటుపోట్లను స్థితప్రజ్ఞతతో
తట్టుకోవాలి.
4. ఉగాది నాటి పిండివంటలు
మనమే తింటే చాలదు
మనింటికి అతిథులొస్తే
వారిని మర్యాదగా
చూసుకోవాలి.
5. ఉగాది నాటి కోయిల కూతలూ,
పచ్చదనమూ
వసంతంలోనే ఉండిపోతే సరిపోదు
అవి మన మనసులలో
ఎల్లప్పుడూ ఆహ్లాదాన్ని,
ఆనందాన్ని పంచాలి.
***
No comments:
Post a Comment