Showing posts with label Ugadi short story. Show all posts
Showing posts with label Ugadi short story. Show all posts

Wednesday, March 29, 2017

ఉగాది స్పెషల్ చిట్టి (హాస్య) కథ-చాదస్తపు అత్త- గడుసరి కోడలు


        ఒక్కగానొక్క నలుసు ఎనిమిదేళ్ళ చింటూకి తలంటి, కొత్త బట్టలేసి, దేవుడికి దణ్ణం పెట్టించి, మామ్మ గారి చేతుల మీదుగా ఉగాది పచ్చడి తినమని పంపి పిండి వంటలకి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుంటోంది పల్లవి. వాడు చటుక్కున ఏడుపుతో తిరిగి వచ్చాడు. మామ్మ గారి గారాల మనవడెందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు పల్లవికి. “ఉగాది పచ్చడి నువ్వు చేస్తే బాగుండేది. ఈ మాటు అంతా చేదుగా ఉంది...” అని విషయం చెప్పి మళ్ళీ ఏడవ సాగాడు చింటూ.