Wednesday, December 7, 2016

స్వార్థం పోయేదెప్పుడు?

1.    



పసుపు, ఎరుపు రంగుల కలయికే సంధ్య
ప్రాతస్సంధ్యైతే అది ఒక రోజుకి శుభారంభం
ఎన్నో ఆశలు ఫలించడానికి మొదటి మెట్టు
పక్షులు పొట్టకూటికి బయలుదేరే సమయమది.

2.     రెండు రంగుల మిశ్రమం
బారులు తీరిన పక్షులు
చూసే వారికి ఆహ్లాదకరం
కవులకి, చిత్రకారులకి స్ఫూర్తిదాయకం.
3.     కష్ట పడ్డ పక్షులు సాయం సంధ్యకి గూళ్ళు చేరుకుంటాయి.
మనిషి మాత్రం ప్రకృతి సూత్రానికి విరుద్ధంగా రోడ్డున పడతాడు.
సినిమాలు, షికార్లు, షాపింగ్లూ, చెడు తిరుగుళ్ళూ
రాత్రంతా వేషాలు వేసి వేకువ అందాన్ని కాంచే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడు.
4.     సంపూర్ణ సూర్యగ్రహణం అప్పుడు విషయం తెలియని పక్షులు పాపం గూటికేగుతాయి
నిజం తెలిసిన వెంటనే మళ్ళీ వాటి పని అవి చేసుకుంటాయి.
మనిషి మాత్రం మిథ్యాగ్రహణంలో నిత్యం చిక్కుకొనుంటాడు
ప్రకృతి అందాన్ని ఆస్వాదించడం మరచిపోయాడు.
5.     అందుకేనేమో అత్యంత ఉత్సాహంతో పకృతి విధ్వంసానికి పూనుకుంటున్నాడు
ఎత్తైన కట్టడాలు కట్టి సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేదాకా దాచేస్తున్నాడు
చెట్లు కొట్టి, పక్షులని నిర్వాసితులను చేసి, తద్దినాలకి తెచ్చే కాకులకు గిరాకీ పెంచాడు
జీవ వైరుధ్యం తగ్గించి, ఓజోన్ పొరకు చిల్లు కొట్టి, అందమైన ఆకాశానికి తన మనసులో ఉన్న నల్ల రంగు పూయ జూస్తున్నాడు.

ఈ మనిషి మారేదెపుడు? అతని స్వార్థం పోయేదెప్పుడు?
సంధ్యాసమయం ఆహ్లాదాన్ని పంచేదెపుడు? పక్షులు సంతోషించేదెపుడు?

***

No comments: