Showing posts with label matriarchal family. Show all posts
Showing posts with label matriarchal family. Show all posts

Thursday, March 31, 2016

మాతృస్వామిక కుటుంబం


"మా డిపార్టుమెంటులో పెద్దాయనతో మాట్లాడానోయ్. నా బదిలీ విషయంలో సాయం చేస్తానన్నారు", అన్నాడు అనిల్. హరిత సంతోషంగా, "అలాగా, ఆ కనకమ్మ దయవల్ల అదే త్వరలో అయితే మన కష్టాలు తీరినట్టే, అని అత్తయ్య అంటున్నారు", అంది.
"పిల్లలు ఇవ్వాళ కూడా పడుక్కున్నారా?"
"పడుక్కోరు మరి? రాత్రి పదకొండు కావస్తూంటే?"
"సారీ హరీ, రేపైనా వాళ్ళతో స్కైప్ లో చాట్ చేస్తా, సరేనా?"
"'రేపు' అని బోర్డు మీద వ్రాసినట్టే వుంది నీ వరస చూస్తుంటే! అత్తయ్య కూడా నీతో మాట్లాడాలని ఉబలాట పడుతున్నారు".
"సరే, తప్పకుండా! ఇలా ఫోన్లో కాకుండా నీతో లైవ్ గా గుడ్ నైట్ చెప్పాలనుంది".
"అనిల్, అమ్మవారికి ప్రార్థించు".
"నాలుగు రోజులు సెలవు పెట్టి ఇక్కడికి రాకూడదూ?"
"అత్తయ్య పిల్లల్ని చూసుకోలేక పోతున్నారు. పోనీ మా అమ్మ దగ్గర వదులుదామంటే ఆవిడకి టైఫాయిడ్ వచ్చి తగ్గిందికదా. ఇప్పటికీ వంటా అవీ నేనే చూసుకుంటున్నాను. నాన్న ఆవిడకి సపర్యలు మాత్రమే చేయగలుగుతున్నారు! రొటీన్ పనులకే ఇంత కష్టంగా వుంటే నువ్వు అక్కడికి రమ్మంటావేమిటి? ఇంక హాయిగా నిద్రపో. గుడ్ నైట్".
*****