Showing posts with label idealism. Show all posts
Showing posts with label idealism. Show all posts

Monday, February 15, 2016

దేవుడిచ్చిన పండు


"అమ్మా, ఈ లిటిక్కాయని నేను తింటున్నాను", అంది ఏడేళ్ళ ధృతి, సంధ్యాదీపం పెడుతున్న వాళ్ళమ్మ లావణ్యతో. దీపం పెట్టాకతులసమ్మ కోసమని ఓ వెలిగించిన అగరువత్తుని తీసుకెళ్తున్న లావణ్య, "ఏ లిటిక్కాయ? మన ఇంట్లో అంత చిన్న కాయలు లేవే?" అని గొణుక్కుంటూ తులసి కోట కేసి నడవసాగింది. "ఇదిగో!" అని ఓ అరగంట ముందు గుడిలో అర్చన చేసినప్పుడు ఇచ్చిన అరటిపండును చూబిస్తూ దారికడ్డం పడింది ధృతి. "కొంచెంలో చెయ్యి కాలి ఉండేది. ఏమిటీ వేషాలు?" అని కూతుర్ని కోప్పడి, ఆ పండును చూసి, "ఇది దేవుడిచ్చిన పండు. దాన్ని లిటిక్కాయ అనకూడదు. అందరితోనూ పంచుకోవాలి, అంటే పైడమ్మతో సహా," అని నీతి ఉపదేశించింది లావణ్య.