Wednesday, July 11, 2018

చిత్రకవిత- ఓ యువతా, మేలుకో!



ఓ యువతా, మేలుకో!
ట్రెండీ బట్టలు వేసుకుని అంతా కులాసా అనుకోకు
దీపాల మిణుకు చూసి వెలుగనుకోకు
సంధ్యను చూసి పొంగిపోకు
అది వేకువో సాయంత్రమో తెలుసుకో!


స్వార్థపు గిరి నుండి బయటకు రా!
నలుగురికీ ఉపయోగపడు!
చరవాణిలోకి చూస్తూ దించిన తలనెత్తు
నలుగురిలో తలెత్తుకునేలా మంచి పనులు చెయ్యి!
ఊహా ప్రపంచాన్ని విడు
నిజమైన ప్రపంచంలోకి నడు!
ఓ యువతా మేలుకో!
నీ చుట్టూ ఉన్న దురాచారాలని రూపుమాపు
నీ వెలుగుని ప్రసరించు
లోకానికి వెలుగునందించు!
***********

No comments: