Tuesday, July 17, 2018

చిత్రకవిత- వానొస్తే...



వానొస్తే...
మండుటెండలు చెరిగేసే ఈ దేశంలో వానొస్తే ఎంతో హాయి
వాన తెచ్చే చల్లదనం కోసం ఎదురు చూస్తూ గడిపేస్తాం ఎండా కాలాన్ని
వానొస్తే మనకు మాత్రమేనా ఆనందం?


కాదు కాదు పూలు పరవశంతో ఊపుతాయి తలలు
పశువులు ఆహ్లాదంగా విహారంలో ఊపుతాయి తోకలు
బయటే చల్లగా ఉందంటూ మెలికల నడకలు సాగిస్తాయి సర్పాలు
వానంటే మనషులు భయపడతారని కూసంత కునుకు తీస్తాయి విద్యుత్తీగెలు
వానొస్తే నీడ కోసం పరుగెత్తేదెవరు?
మన మనుషులే! ఎందుకు?
మన పనితనం వల్ల!
పచ్చదనాన్ని హరించే మన స్వార్థం వల్ల
డ్రెయినేజీ పనులు సరిగ్గా చేయని మన నిర్లక్ష్యం వల్ల
మనసులోని నిర్మాల్యం కన్నా బట్టల శుభ్రతకే
పెద్దపీట వేసే మన కుహనా విలువల వల్ల!

వానొస్తే హాయిగా తడిసి, ముద్దయ్యి,
మట్టి అంటించుకుని,
చిన్న జలుబుతో బయటపడే
అమాయకపు రోజులు ఎప్పుడు వస్తాయో!!

**********************

No comments: