Wednesday, August 1, 2018

చిత్రకవిత- ఆరోగ్యకరమైన బాల్యం


ఆరోగ్యకరమైన బాల్యం
ఆటంటే బయటే!
గోళీలాట కావచ్చు
గిల్లీ డండా కావచ్చు
పరుపందేలు కావచ్చు
కోతి కొమ్మచ్చి కావచ్చు

ఒక రోజు గెలుపు
మరుసటిరోజు ఓటమి
ఒక రోజు దెబ్బలు, చెక్కుకుపోడాలు
మరో రోజు మట్టి అంటదు
 క్రీడాస్ఫూర్తి నేర్చుకున్నాం
స్థితప్రజ్ఞతంటే తెలియకుండా పాటించాం
స్వార్థం తగ్గించుకున్నాం
పాపలనుండి పిల్లలమయ్యాక మరబొమ్మలతో గాక
మనుషులతో ఆడుకోవడం నేర్చుకున్నాం
ప్రకృతితో సాహచర్యం నేర్చుకున్నాం
ఆ కాంతను గౌరవించడం నేర్చుకున్నాం
శారీరిక దారుఢ్యాన్ని పెంపొందించుకున్నాం
మానసిక ఉల్లాసాన్ని పొందాం

ఈ రోజుల్లో పిల్లలు
ఆటపాటలు మర బొమ్మలతో
మనుషుల పొడగిట్టదు
ఆడే ఆనందం వాళ్ళకెక్కడిది?
***********

No comments: