Showing posts with label theme based poetry. Show all posts
Showing posts with label theme based poetry. Show all posts

Monday, August 20, 2018

స్వీయ కవిత- Theme- జల ప్రళయం -జన జీవనం కకావికలం- ప్రకృతి విలయతాండవం


ప్రకృతి విలయతాండవం
మానవులు వరదల వల్ల కష్టపడుతున్నారని బాధపడేవడా!
ఓ మానవుడా! వారి కష్టానికి కారణమెవ్వరు?
కొండలను పిండి చేసే యంత్రాలున్నాయని భుజాలెగరేసిందెవరు?
వాటిని పనిలోపెట్టి గొప్పలు కొట్టుకున్నదెవరు?

Monday, August 13, 2018

స్వీయ కవిత- Theme- వృద్ధాప్యంలో తల్లితండ్రుల పట్ల పిల్లల బాధ్యత, నేటి పరిస్థితి- నేను- నాది


నేను- నాది
తొమ్మిది నెలలు కడుపులో కాపాడి
స్వావలంబన వచ్చే వరకూ తమ రెక్కలతో
నన్ను రక్షించిన తల్లిదండ్రులని నేనిప్పుడు పట్టించుకోనోచ్!
ఎందుకంటే, ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా కదా!
కన్నాక వాళ్ళు నన్ను పెంచక మానరు కదా!

Monday, August 6, 2018

స్వీయ కవిత- Theme-మధురమైన జ్ఞాపకాల సవ్వడిలో


1.     అమ్మపోరుతో పాత పుస్తకాలు
సర్దడం మొదలుపెట్టిన నాకు
కనిపించింది వాటి మధ్య ఓ నెమలీక
ఆ ఈక తెచ్చిన మధురమైన జ్ఞాపకాల సవ్వడిలో
నా మనసు నెమలిలా నాట్యమడగా
సర్దుడు చెట్టెక్కె, అమ్మ నన్ను తిట్టె!

Monday, July 23, 2018

స్వీయ కవిత- Theme-వరకట్న(ష్ట)ము- అసలు వాళ్లకి పెళ్ళౌతుందా?


అసలు వాళ్లకి పెళ్ళౌతుందా?
ఓ ఆడపిల్ల సందిగ్ధం:
నేను కొనుక్కున్న సీడీ
నాక్కావలసిన పాటలు పాడుతుంది
నేను కొనుక్కున్న కారు
నాక్కావలసిన చోటికి తీసుకు వెళ్తుంది
వీటి కన్నా ఖరీదుపెట్టి కొనుక్కోబోయే
భర్తతో సర్దుకుపొమ్మంటుంది మా అమ్మ,
అదేమి చోద్యమోగాని!

Friday, July 20, 2018

స్వీయ కవిత- Theme- ధనము-మానవత్వము- ఇవేం రోజులురా బాబూ!


ఇవేం రోజులురా బాబూ!
ఏవా రోజులు?
ధనవంతులు దానకర్ణులనే
పేరుకోసం పాకులాడిన రోజులు
మనకున్న దానిలో నలుగురి కడుపులూ
నింపాలనుకున్న రోజులు?

Sunday, July 15, 2018

స్వీయ కవిత- Theme- అంతర్జాల మాయాజాలంలో చిక్కిన మనీషి- సర్వం మాయే


సర్వం మాయే
వ్యసనాలకు దూరంగా ఉండే మనుషులు కూడా
ఈ మయాజాలంలో చిక్కుకుంటున్నారు
ముందు ఒక సౌకర్యంలా ఉద్భవిస్తుంది
తరువాత మరిన్ని సౌకర్యాలందిస్తుంది
అవీ, ఇవీ చూడమని ఉప్పందిస్తుంది
వాటి చుట్టూ ఒక ఉచ్చు బిగించి ఊపిరాడకుండా చేస్తుంది

Wednesday, June 27, 2018

స్వీయ కవిత- Theme-"విదేశీ విద్యా మోజు.......అక్కడ నానా కష్టాలే ప్రతి రోజు"- కష్టే ఫలే


కష్టే ఫలే
విదేశీ విద్యంటే ఎందుకుండదు మోజు?
ఈనాటి మన దేశపు చదువులు మనకు మనోవికాసం కలిగిస్తాయా?
కష్టపడి చదివేవాడికి సరైన ప్రోత్సాహం ఉంటోందా?
వాడి ప్రతిభకు తగ్గ ఉద్యోగం వస్తోందా?
పరీక్షల సీసన్ లో ఏ వార్తా పత్రిక తిరగేసినా, కాపీలు కొట్టే వారి కథలే
చదివినా చదవకపోయినా పై తరగతికి వెళ్ళిపోయి, చదువొచ్చినట్టు భుజాలు ఎగరేయడమే!
ప్రతిభను గుర్తించని చదువు నాకొద్దు

Monday, June 18, 2018

స్వీయ కవిత- Theme-"వైద్యో నారాయణో హరీ..... రొక్కముంటేనే" -సార్థకం



సార్థకం
వైద్యం చేయదానికి రోగి ఉంటే చాలు
అది ఆనాటి మాట
అందుకే వైద్యో నారాయణో హరీ అన్నారు!

Tuesday, June 12, 2018

స్వీయ కవిత- Theme- దేహము నీటి బుగ్గ..... జీవితము నీటి బుడగ...... మెండైన వ్యామోహము ........- ఇదేం వింతో గాని...


ఇదేం వింతో గాని...
నీటి బుగ్గ సలసలా కాగుతోందని అబ్బురపడిపోతాం ...
మన జీవితమే కాగి అవిరవడానికి సిద్ధపడుతోందని గ్రహించం!

Monday, June 4, 2018

స్వీయ కవిత- Theme- ఉప్పొంగిన ఉల్లాసపు సడిలో ఉబికిన కన్నీటి ధారలు



1.   ఓటమినెదుర్కునేందుకు సంసిద్ధమయ్యానానాడు
మరో అవకాశం కోసం ఆగాలి ఆర్నెల్లు
ఆ ఎదురుచూపులలో ఓ శుభోదయాన వరించె నన్ను విజయమ్ము
ఉప్పొంగిన ఉల్లాసపు సడిలో ఉబికెను కన్నీటి ధారలు!

Wednesday, May 30, 2018

స్వీయ కవిత- వెన్నెల రేయి అలకేలనోయి- కౌసల్య విన్నపము

కౌసల్య విన్నపము:

చందురుని కోరిన అద్దంలో చూపారు నాన్న
మరిక అన్నం వద్దని మారాము చేసెదవేలా?