Monday, June 18, 2018

స్వీయ కవిత- Theme-"వైద్యో నారాయణో హరీ..... రొక్కముంటేనే" -సార్థకం



సార్థకం
వైద్యం చేయదానికి రోగి ఉంటే చాలు
అది ఆనాటి మాట
అందుకే వైద్యో నారాయణో హరీ అన్నారు!


రోగి బతికున్నా లేకపోయినా
రొక్కముంటేనే చాలు
వైద్యం చేసే ప్రబుద్ధులున్నారీ లోకంలో!
ఇది కేవలం వారి తప్పు మాత్రమేనా?
కాదు, కానేరదు!
ఈ దుఃస్థితికి కారణం ఎవ్వరు?
సేవగా పరిగణించాల్సిన వైద్యవృత్తిని
రొక్కం సంపాదించే ఆయుధంగా
లెక్క వేస్తున్న సమాజానిది!
డబ్బులు సంపాదిస్తేనే గౌరవం లభిస్తుందని
బోధించి, పెద్ద చేసే తల్లిడంద్రులది!
సేవ చేసే వైద్యులని పనికి రానివారిగా
జమకట్టే మనందరిదీ!
వైద్యో నారాయణో హరీ..... రొక్కముంటేనే
అనే వైద్యలు మటుమాయమవాలంటే
ఈ సమాజానికి పట్టిన డబ్బు పిచ్చి వదలాలి
తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావాలి
అప్పుడే, “వైద్యో నారాయణో హరీ" అనే మాట
సార్థకం అవుతుంది!
****************

No comments: