Wednesday, June 20, 2018

చిత్రకవిత- సూర్యుడికి కోపం రాదు మరి?






సూర్యుడికి కోపం రాదు మరి?
వడ దెబ్బ  తట్టుకోలేకపోతున్నావా?
నువ్వెన్ని చెట్లు నరికావో గుర్తు తెచ్చుకో...
ఆ వడ దెబ్బకి నువ్వెంత సాయం చేశావో తెలుసుకో!  


వడ దెబ్బ తట్టుకోలేకపోతున్నావా?
నీ కారులో ఏసీ ఎంత చల్లగా ఉందో  గుర్తు తెచ్చుకో...
ఆ వడ దెబ్బకి నువ్వెంత సాయం చేశావో తెలుసుకో!   

వడ దెబ్బ తట్టుకోలేకపోతున్నావా?
తాగడానికి పచ్చి మంచినీళ్ళు కూడా కరువయ్యాయా?
నువ్వెన్ని చెరువులు ఆక్రమించావో గుర్తు తెచ్చుకో...
వడ దెబ్బకి నువ్వెంత సాయం చేశావో తెలుసుకో!

వడ దెబ్బ తట్టుకోలేకపోతున్నావా?
ఈ భూమి నశించడానికి ఏయే పాపాలు చేశావో గుర్తు తెచ్చుకో...
ఆ వడ దెబ్బకి నువ్వెంత సాయం చేశావో తెలుసుకో!   
నీ మీద ఆ సూర్యుడికి కోపం రాదు మరి?
******************


No comments: